Ram Charan: సల్మాన్ ఖాన్ బ‌ర్త్‌డే.. పెద్ది హంగామా

ABN , Publish Date - Dec 29 , 2025 | 08:04 AM

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) బ‌ర్త్‌డే వేడుకలు గ్రాండ్‌గా జరిగాయి..

Ramcharan

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) బ‌ర్త్‌డే వేడుకలు గ్రాండ్‌గా జరిగాయి. ముంబైలోని పన్వేల్ ఫామ్‌హౌస్ (Panvel Farmhouse)లో జరిగిన సెలబ్రేషన్స్ వైరల్ గా మారాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా ఫ్యాన్స్, సెల‌బ్రిటీలు సామాజిక మాధ్య‌మాల ద్వారా శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇక‌.. ఇప్ప‌టికే టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి.. స‌ల్మాన్‌తో ఉన్న స్నేహాన్ని గుర్తు చేస్తూ ఓ సుధీర్ఘ పోస్టుతో పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపాడు.

Ramcharan

ఆపై.. 'భాయ్ జాన్స‌ బర్త్‌డే సందర్భంగా ముంబైలో నిర్వ‌హించిన సెల‌బ్రేష‌న్స్‌కు బాలీవుడ్, టాలీవుడ్‌తో పాటు క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు హాజరై సందడి చేశారు. ముఖ్యంగా ధోనీ (MS Dhoni), రామ్ చ‌ర‌ణ్ (Ram Charan), అమీర్ ఖాన్ (Aamir Khan), బాబీ డియోల్ (Bobby Deol), సంజయ్ దత్, రకుల్, ప్రగ్యా వంటి వారు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈ క్ర‌మంలో స‌ల్మాన్ స్వ‌త‌హాగా బైక్ న‌డిపి అక్క‌డికి వ‌చ్చిన వారిలో కొత్త జోష్ నింపాడు.

Ramcharan

అయితే.. చాలా రోజుల త‌ర్వాత రామ్‌చ‌ర‌ణ్‌, క్రికెట‌ర్ ధోని ఒకే వేదిక‌పై క‌లిసి క‌న‌బ‌డ‌డంపై ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. లెజండ్స్ అంతా ఒక్క ఫ్రేమ్‌లో అదిరిపోయారంటూ వారి వారి అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోష‌ల్‌ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. మీరూ ఓ లుక్కేయండి.

Ramcharan

Updated Date - Dec 29 , 2025 | 08:04 AM