Ram Charan: ఆ సీక్వెన్స్‌ 'పెద్ది’కి మేజర్‌ హైలెట్‌

ABN , Publish Date - Jun 23 , 2025 | 10:22 AM

గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌ నటిస్తున్న చిత్రం ‘పెద్ది’ . నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ ఫిలిం మేకర్‌ బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు

Ram Charan And Ratnavelu in Peddi shoot


గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan) నటిస్తున్న చిత్రం ‘పెద్ది’ (Peddi). నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ ఫిలిం మేకర్‌ బుచ్చి బాబు సానా (IBuchibabu sana) దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే సినిమా ఫస్ట్‌ షాట్‌ గ్లింప్స్‌తో దేశవ్యాప్తంగా హ్యుజ్‌ బజ్‌ క్రియేట్‌ చేసింది. మైత్రి మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పణలో వెంకట సతీష్‌ కిలారు వృద్థి సినిమాస్‌ బ్యానర్‌ పై భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం భారీ యాక్షన్‌ నైట్‌ సీక్వెన్స్‌ షూటింగ్‌ జరుగుతోంది. ఈ సినిమాకు డీఓపీగా పని చేస్తున్న రత్నవేలు ‘పెద్ది’ సెట్స్‌ నుంచి పవర్‌ ఫుల్‌ మోమెంట్‌ను షేర్‌ చేశారు. గ్లోబల్‌ స్టార్‌తో భారీ నైట్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ చిత్రీకరిస్తున్నట్లు తెలియజేశారు. ఈ స్టిల్‌లో రామ్‌ చరణ్‌ ఇంటెన్స్‌ అండ్‌ బీస్ట్‌ మోడ్‌లో కనిపించారు. ప్రస్తుతం  ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ ఫొటో వైరల్‌ అవుతుంది. సినిమాలో ఈ సీక్వెన్స్‌ మేజర్‌ హైలెట్‌గా ఉండబోతోందని టీమ్‌ చెబుతోంది. 

ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివరాజ్‌ కుమార్‌, జగపతి బాబు, దివ్యేంద్రు శర్మ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆర్‌. రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా, ఆస్కార్‌ అవార్డు విజేత ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతం అందిస్తున్నారు. జాతీయ అవార్డు గెలుచుకున్న నవీన్‌ నూలి ఎడిటర్‌గా పని చేస్తున్నారు. 2026 మార్చి 27న రామ్‌ చరణ్‌ పుట్టినరోజున ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.

Updated Date - Jun 23 , 2025 | 10:22 AM