Peddi VS Paradise: పంతం నీదా.. నాదా.. సై

ABN , Publish Date - Dec 15 , 2025 | 04:47 PM

సాధారణంగా ఇండస్ట్రీలో పోటీ ఎలా ఉంటుందో అందరికీ తెల్సిందే. అదే పండగ సమయంలో.. సమ్మర్ సమయంలో సినిమాల మీద సినిమాలు రిలీజ్ చేస్తుంటారు.

Peddi VS Paradise

Peddi VS Paradise: సాధారణంగా ఇండస్ట్రీలో పోటీ ఎలా ఉంటుందో అందరికీ తెల్సిందే. అదే పండగ సమయంలో.. సమ్మర్ సమయంలో సినిమాల మీద సినిమాలు రిలీజ్ చేస్తుంటారు. ఎందుకంటే అప్పుడే సెలవులు ఉంటాయి. కుటుంబ సమేతంగా అందరూ థియేటర్స్ కి వస్తారు. కలక్షన్స్ వస్తాయి కాబట్టి. అందుకే స్టార్ హీరోలు తమ సినిమాలను రిలీజ్ చేస్తారు. ఈసారి సంక్రాంతికి అరడజను కన్నా ఎక్కువ సినిమాలు పోటీకి వస్తున్నాయి. అందులో రిలీజ్ వరకు ఏది వస్తుంది.. ఏది పోతుంది అనేది తెలియదు.

ఇక సంక్రాంతి సినిమాలు పక్కన పెడితే.. సమ్మర్ సినిమాపైనే ప్రేక్షకులు ఎక్కువ ఫోకస్ చేశారు. ఈసారి మార్చి నిరుడు లెక్క ఉండదు అని అనిపిస్తుంది. రెండు పెద్ద సినిమాలు ఒక్కరోజు తేడాతో రాబోతున్నాయి. అవే రామ్ చరణ్ పెద్ది.. నాని ది ప్యారడైజ్. రెండు సినిమాలు రెండు డిఫరెంట్ జానర్స్ లో రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటివరకు ఎవరో ఒకరు తగ్గుతారులే అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు అస్సలు తగ్గేదేలే అంటూ ఇద్దరూ ఆ డేట్స్ లోనే వస్తున్నట్లు ఎప్పటికప్పుడు మేకర్స్ హింట్ ఇస్తూనే ఉన్నారు.

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో పెద్ది తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమాపై హైప్ మాములుగా లేదు. ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ షాట్, చికిరి చికిరి సాంగ్ సినిమాపై అంచనాలను ఆకాశాన్ని దాటేలా పెంచేసాయి. మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ఇండస్ట్రీ మొత్తం పెద్ది కోసం ఎదురుచూస్తుంది. రామ్ చరణ్ పుట్టినరోజు అయిన మార్చి 27నే పెద్దిని రిలీజ్ చేస్తున్నారు. సెంటిమెంట్ డేట్ కాబట్టి ఎలాంటి పోటీ ఉండకుండా ఆరోజు పెట్టుకున్నారు. కానీ, దానికి ముందు రోజే నాని ది ప్యారడైజ్ ని లాక్ చేశాడు.

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ది ప్యారడైజ్. ఈ సినిమాపై కూడా భారీగా అంచనాలు ఉన్నాయి. మోహన్ బాబు విలన్ గా రీఎంట్రీ ఇవ్వడంతో సినిమాపై హైప్ బాగా పెరిగింది. అంతేకాకుండా నాని - శ్రీకాంత్ ఓదెల కాంబోలో ఇప్పటికే దసరా లాంటి బ్లాక్ బస్టర్ వచ్చింది. దీంతో ఫ్యాన్స్ కచ్చితంగా ది ప్యారడైజ్ కూడా హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నారు.

ఇలా ఈ రెండు సినిమాలు హైప్ తోనే ఉన్నాయి. ఇవి ఒకరోజు తేడాతో రిలీజ్ అయితే ఏ సినిమా మీద ఏ సినిమా ఎఫెక్ట్ పడుతుంది అనేది చెప్పడం కష్టంగా మారింది. కొన్నిరోజుల నుంచి ప్యారడైజ్ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి అని వార్తలు వచ్చాయి. కానీ, శ్రీకాంత్ ఓదెల బర్త్ డే వీడియోలో కూడా మార్చి 26నే డేట్ వేయడంతో కచ్చితంగా నాని తగ్గడం లేదని తెలుస్తోంది. ఇలా వీరిద్దరూ పంతం నీదా నాదా అని అనుకుంటే బాక్సాఫీస్ వద్ద రసవత్తరమైన పోటీ ఉండడం ఖాయం. మరి ఈ రెండు సినిమాల్లో గెలిచేది ఏది.. ? ఓడేది ఏది అనేది తెలియాలంటే సమ్మర్ వరకు ఆగాల్సిందే.

Updated Date - Dec 15 , 2025 | 04:53 PM