Virgin Boys: మిత్రాశ‌ర్మ.. పెద‌వుల త‌డి రొమాంటిక్ సాంగ్ రిలీజ్‌

ABN , Publish Date - May 24 , 2025 | 10:43 PM

గీతానంద్, మిత్రాశ‌ర్మ, శ్రీహ‌న్, బిగ్‌బాస్ విన్న‌ర్ కౌశ‌ల్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో రూపొందించిన రొమాంటిక్‌ కామెడీ చిత్రం విర్జిన్ బాయ్స్

virgin

గీతానంద్ (Geethanand), మిత్రాశ‌ర్మ (Mitraaw Sharma), శ్రీహ‌న్, బిగ్‌బాస్ విన్న‌ర్ కౌశ‌ల్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో రూపొందించిన రొమాంటిక్‌ కామెడీ చిత్రం విర్జిన్ బాయ్స్ (Virgin Boys).యువతీయువకుల మధ్య ప్రస్తుతం ఉన్న రిలేషన్‌షిప్స్‌ గురించి వివరిస్తూ దయానంద్ (Dayanand) దర్శకత్వంలో రాజా దరపునేని (Raja Darapuneni) నిర్మించారు. ఇలీవ‌లే విడుద‌ల చేసిన టీజ‌ర్ యూత్‌లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

నేటి యూల్‌ను టార్గెట్ చేస్తు వాళ్ల లాంగ్వేజ్లో తెర‌కెక్కించిన‌ట్లు అర్థ‌మ‌వుతుంది. సినిమా మొత్తం అర్థ‌న‌గ్న దృశ్యాలు, డ‌బుల్ మీనింగ్ గైలాగ్స్, ముద్దు సన్నివేశాల‌తో నింపేశారు. పైగా ఇది ఇండియాస్ మోస్ట్ డేరింగ్ రామ్‌కామ్ అంటూ మేక‌ర్స్ ప్ర‌క‌టించ‌డం విశేషం. అయితే ఈ చిత్రం నుంచి తాజాగా పెద‌వుల త‌డి అంటూ సాగే రొమాంటిక్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఇందులోను ఓ ఘాటైన ముద్దు స‌న్నివేశం ఉండి యూత్‌ను వెంట‌నే ఆక‌ర్శించేలా ఉంది. ఇదిలాఉండ‌గా ఈ పాట విడుద‌లైన గంట‌ల్లోనే ల‌క్ష‌కు పైగా వ్యూస్ ద‌క్కించుకోవ‌డం విశేషం.

DZ1Ua_J8Fww-HD.jpg

ఈ మూవీ గురించి నిర్మాత మాట్లాడుతూ ‘యూత్‌కి కనెక్ట్‌ అయ్యేలా చిత్రాన్ని తీశాం. ఇంతకుముందు ఎన్నో యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్స్‌ వచ్చినా వాటిని మైమరిపించేలా సినిమా ఉంటుందని అన్నారు. ఆయ‌న మాట‌ల‌కు త‌గ్గ‌ట్టుగానే టీ.ర్‌, పాట బోల్డ్ సీన్ల‌తో నింపేశారు. ఈ చిత్రానికి ఎడిటర్‌: మార్తాండ్‌.కె.వెంకటేశ్‌, డీఓపీ: వెంకట ప్రసాద్‌, సంగీతం: స్మరణ్‌ సాయి. శ్రీహాన్‌, రోనిత్‌, జెన్నిఫర్‌, అన్షుల, సుజిత్‌కుమార్‌, అభిలాష్‌ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

Updated Date - May 24 , 2025 | 10:43 PM