Venkatalachimmi: పాయల్ బర్త్ డే పోస్టర్.. అభిమానులు షాక్

ABN , Publish Date - Dec 05 , 2025 | 05:32 PM

'ఆర్‌ఎక్స్‌ 100’, ‘మంగళవారం’ చిత్రాలతో యువత మదిని దోచిన పాయల్ రాజ్ పుత్ నటిస్తున్న తాజా చిత్రం 'వెంకటలచ్చిమి'. ఆమె పుట్టిన రోజు సందర్భంగా బర్త్ డే పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

Payal Rajput Birthday Poster

'ఆర్‌ఎక్స్‌ 100’ (RX 100) ‘మంగళవారం’ (Mangalavaaram) వంటి సినిమాలతో యూత్ ఆడియ‌న్స్‌కు హాట్ ఫేవ‌రేట్ హీరోయిన్‌గా మారిన‌ పాయల్‌ రాజ్‌పుత్ (Payal Rajput) ఈ సారి ‘వెంకటలచ్చిమి’ (Venkatalachimmi) గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డిసెంబర్ 5 పాయల్‌ రాజ్‌పుత్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం శుభాకాంక్షలు తెలియచేస్తూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది. దీన్ని చూసి ఆమె అభిమానులంతా షాక్ కు గురవుతున్నారు. జైలు గదిలో తల్లకిందులుగా వేలాడ దీసి, చేతికి సంకెళ్ళు వేసి చిత్రహింసలకు ఆమెను గురిచేసినట్టున్న ఈ పోస్టర్ చూసి... బర్త్ డే సందర్భంగా ఇలానా విషెస్ తెలియచేసేది అని ప్రశ్నిస్తున్నారు. అయితే మూవీ థీమ్ ను, కథలోని లోతును ఈ పోస్టర్ ద్వారా దర్శకుడు ముని తెలియచెప్పే ప్రయత్నం చేశాడని అర్థమౌతోంది. రాజా, పవన్ బండ్రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్, గ్లిమ్స్ త్వరలోనే రాబోతున్నాయి.


payalrajput venkatlachimi (1).JPG

ఆదివాసీ మహిళ ప్రతీకార కథగా 'వెంకటలచ్చిమి' చిత్రాన్ని తెరకెక్కించబోతున్నామని, కథ, కథనాలు ఆసక్తికరంగా ఉంటాయని దర్శకుడు ముని పేర్కొన్నారు. ఈ కథ తనకు ఎంతగానో నచ్చిందని, ఈ సినిమా తర్వాత తనను ప్రేక్షకులు 'వెంకటలచ్చిమి' అనే పేరుతో పిలుస్తారని, అంత బలమైన భావోద్వేగాలుంటాయని పాయల్‌ రాజ్‌పుత్‌ తెలిపింది. పాన్‌ ఇండియా స్థాయిలో 6 భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి వికాస్ బడిస సంగీతం అందిస్తున్నారు.

Updated Date - Dec 05 , 2025 | 06:38 PM