Akira Nandan: ‘ఓజీ’తో ఎంట్రీ.. మరో హింట్‌ వైరల్‌..

ABN , Publish Date - Sep 23 , 2025 | 02:22 PM

'ఓజి' చిత్రంలో ఓ సర్‌ఫ్రైజ్‌ ఉందని అభిమానులు నమ్ముతున్నారు. ఇందులో పవన్‌ వారసుడు అకీరా నందన్‌ కూడా ఉన్నాడని చాలాకాలంగా వార్తలొస్తున్నాయి.

Akira Nandan


పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) హీరోగా సుజీత్‌ 9Sujeeth) దర్శకత్వం వహించిన 'ఓజీ' (OG movie) చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రియాంక అరుళ్‌ మోహన్‌ (Priyanka Mohan) కథానాయిక. డి.వి.వి.దానయ్య నిర్మాత. ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో ఓ సర్‌ఫ్రైజ్‌ ఉందని అభిమానులు నమ్ముతున్నారు. ఇందులో పవన్‌ వారసుడు అకీరా నందన్‌ కూడా ఉన్నాడని చాలాకాలంగా వార్తలొస్తున్నాయి.  ఈ చిత్రం ఫస్ట్‌ సాంగ్‌ విడుదలైనప్పటి నుంచి దీనికి సంబంధించిన హింట్స్‌ కనిపించాయన అభిమానులు డిజైన్స్‌ చూసి గుర్తించారు.  

AKira.jpg

అసలు ఈ చిత్రంలో అకీరా ఉన్నాడో లేదో పక్కన పెడితే.. మరో హింట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. లేటెస్ట్‌గా ‘ఓజి’ గేమ్‌ ఒకటి ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. అందులో ఒక కత్తిలో యంగ్‌ కుర్రాడి కళ్ళు కనిపిస్తున్నాయి. ఇవి ఖచ్చితంగా పవన్‌ కళ్యాణ్‌వి అయితే కాదని, బాగా గమనిస్తే అవి అకీరా కళ్లలా ఉన్నాయని ఫ్యాన్స్‌ చెబుతున్నారు. దీంతో ఈ సినిమాలో అకీరా నందన్‌ కూడా ఉన్నాడని బలంగా నమ్ముతున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్‌ మీడియాతో వైరల్‌ అవుతోంది. అయితే ఇందులో అకీరా ఉన్నాడా లేదా అన్నది తెలియాలంటే కొన్ని గంటలు వేచి చూడాల్సిందే!

Updated Date - Sep 23 , 2025 | 03:17 PM