Pawan Kalyans Epic: యోధుడు.. ధీరుడు
ABN , Publish Date - Jul 10 , 2025 | 06:12 AM
పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా జ్యోతి కృష్ణ తెరకెక్కించిన చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఏ.ఎం.రత్నం నిర్మించారు. నిధి అగర్వాల్ కథానాయిక. ఈ నెల 24న చిత్రం పాన్ ఇండియా స్థాయిలో...
పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా జ్యోతి కృష్ణ తెరకెక్కించిన చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఏ.ఎం.రత్నం నిర్మించారు. నిధి అగర్వాల్ కథానాయిక. ఈ నెల 24న చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతోంది. బాబీ డియోల్ ప్రతినాయకుడి పాత్రను పోషించారు. పవన్ తొలిసారి చారిత్రక యోధుడి పాత్రను పోషించడంతో సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు ఆకట్టుకున్నాయి. తాజాగా, ఈ సినిమా నుంచి ‘ఎవరది ఎవరది.. అతగాడో పొడుపు కథ.. దొరకనే దొరకడే అతగాడో మెరుపుకథ.. సూర్యుడికే కన్నుగప్పి సంచరించే యోధుడు.. చంద్రుడ్నే సంచికెత్తి తస్కరించె ధీరుడు’ అంటూ సాగే పాటను విడుదల చేసింది చిత్రబృందం. రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ గీతాన్ని సాయిచరణ్, హైమత్, లోకేశ్వర్ ఆలపించారు. ఎమ్.ఎమ్.కీరవాణి సంగీతం అందించారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: ప్రవీణ్.కె.ఎల్, సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస.