HBD NBK: బాలయ్యకు పవన్ శుభాకాంక్షలు..
ABN , Publish Date - Jun 10 , 2025 | 03:46 PM
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (HBD Balakrishna) పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్తువెత్తున్నాయి.
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (HBD Balakrishna) పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్తువెత్తున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు, నిర్మాణ సంస్థలు, దర్శకుడు ఆయన ఫొటోలు షేర్ చేసిన విషెస్ చెబుతూ పోస్ట్‌లు పెడుతున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) బాలయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘శతాధిక చిత్రాల కథానాయకుడు, హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. చారిత్రక, జానపద, పౌరాణిక పాత్రలు పోషించి మెప్పు పొందిన కథానాయకుడాయన. ప్రజా జీవితంలో భాగంగా హిందూపురం ప్రాంత అభివృద్థికి కృషి చేస్తున్నారు. ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం, సుఖసంతోషాలు అందించాలని దేవుచి?ని ప్రార్థిస్తున్నాను’’ అని పవన్ విష్ చేశారు.
హీరో రామ్‌చరణ్ కూడా ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు.
‘‘సిల్వర్ స్ర్కీన్‌పై ఆయన లెజెండ్.. పొలిటికల్ స్ర్కీన్‌పై ఆయన అన్‌స్టాపబుల్.. ప్రజల గుండెల్లో ఆయన బాలయ్య.. నా ముద్దుల మావయ్య పద్మభూషణ్ బాలకృష్ణకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు’
- నారా లోకేశ్
‘‘బాలయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ అభిరుచి, సమయపాలన సెట్లోని ప్రతి టెక్నీషియన్‌కు స్ఫూర్తినిస్తాయి. మీతో వర్క్ చేేస అవకాశం రావడం నా అదృష్టం. మీరు మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని ఆశిస్తున్నాను’’
- దర్శకుడు బాబీ
‘‘హ్యాపీ బర్త్‌డే బాబాయ్’’ - కల్యాణ్ రామ్