They Call Him OG First Single: సుజీత్.. నీకు గుడి కట్టినా తప్పులేదయ్యా
ABN , Publish Date - Aug 02 , 2025 | 03:32 PM
ఈ ఏడాది హరిహర వీరమల్లు (Harihara Veeramallu) సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మంచి విజయాన్ని అందుకున్నాడు.
They Call Him OG First Single: ఈ ఏడాది హరిహర వీరమల్లు (Harihara Veeramallu) సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మంచి విజయాన్ని అందుకున్నాడు. ఐదేళ్ల నుంచి నలుగుతూ వస్తున్న ఈ సినిమా అసలు డిజాస్టర్ అవుతుందేమో అనుకున్నారు. కానీ, క్రిష్, జ్యోతికృష్ణ తమ కష్టంతో సినిమాను నిలబెట్టారు. పవన్ సైతం తన లుక్స్ తో, నటనతో చాలా సెటిల్ గా చేసి మెప్పించాడు. వీరమల్లు విజయంతో పవన్ నటిస్తున్న మరో సినిమా OGపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.
రన్ రాజా రన్ సినిమాతో డైరెక్టర్ గా టాలీవుడ్ కు పరిచయమైన కుర్ర డైరెక్టర్ సుజీత్.. తన రెండో సినిమానే ప్రభాస్ తో సాహో డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకున్నాడు. ఈ సినిమా ఆసీనహీన ఫలితాన్ని అందుకోలేకపోయినా కూడా సుజీత్ కథలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. ఇక ముచ్చటగా మూడో సినిమానే పవన్ కళ్యాణ్ తో చేసే అవకాశాన్ని పొందాడు. అది కూడా పవన్ రీమేక్ చేయమన్నా కూడా వినకుండా సొంత కథతో పవన్ ను మెప్పించి మరీ OG ని పట్టాలెక్కించాడు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన ప్రియాంక మోహన్ నటిస్తుండగా.. బాలీవుడ్ రొమాంటిక్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ గా తెలుగుతెరకు పరిచయమవుతున్నాడు.
ఇక ఇప్పటికే OG నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకున్నాయో అందరికీ తెల్సిందే. ముఖ్యంగా నెత్తురుకు మరిగిన హంగ్రీ చీతా అంటూ థమన్ పాడిన సాంగ్ ఇంకా టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతుంది. హీరోకు ఎలివేషన్ ఇవ్వాలన్నా ఆ సాంగ్ తోనే.. పవర్ ఫుల్ మ్యూజిక్ కావలన్నా ఆ మ్యూజిక్ నే వాడేస్తున్నారు ఫ్యాన్స్. ఎప్పుడెప్పుడు థమన్.. OG నుంచి మిగిలిన సాంగ్స్ రిలీజ్ చేస్తాడా.. ? అని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఎన్నో వాయిదాల తరువాత ఈ సినిమా సెప్టెంబర్ 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్ OG నుంచి మొదటి సింగిల్ ను రిలీజ్ చేశారు.
ఫైర్ స్ట్రామ్ అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈ సాంగ్ కూడా హీరో ఎలివేషన్ సాంగ్ లానే అనిపిస్తుంది. ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ చుట్టూ జరిగే రక్తపాతాలు.. అతడి గురించి విలన్స్ ఏమనుకుంటున్నారు అనేది ఈ లిరిక్స్ లో చూపించారు. ఈ సినిమాలో పవన్ పేరు ఓజాస్ గంభీర అని తెలుస్తోంది. వీడియోలో పవన్ ఒక గ్యాంగ్ స్టార్ గా గొడవలు పడడం చూపించారు. పవన్ గురించి, అతడి వ్యక్తిత్వం గురించి లిరిక్స్ ను ఎంతో అద్భుతంగా రాసారు విశ్వ, శ్రీనివాస మౌళి. ఇక తెలుగుతో పాటు ఇంగ్లీష్, జపనీస్ లిరిక్స్ ను కూడా ఇందులో పొందుపరిచారు. ఇక ఈ సాంగ్ ను తమ వాయిస్ తో మరో లెవెల్ కు తీసుకెళ్లారు థమన్ ఎస్ , నజీరుద్దీన్ & భరతరాజ్ , శింబు , దీపక్ బ్లూ. మొదటి నుంచి పవన్ సినిమా కోసం శింబు ఒక సాంగ్ పాడుతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. అది ఈ సాంగే. ఫ్యాన్స్ కు మంచి ఊపు ఇచ్చే సాంగ్ అని చెప్పొచ్చు.
రణమున యముడిగా కనపరులే.. దురుసుగా నువు చరచకు తొడలే.. బదులుగా తెగి విరిగెను మెడలే.. రక్కసి దారుల రుధిరం పొరలే అంటూ వచ్చే రైమింగ్ లైన్స్ సాంగ్ మొత్తానికి హైలైట్ అని చెప్పాలి. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. సుజీత్ టేకింగ్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. పవన్ ను ఎంతో స్టైలిష్ గా చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. చాలాకాలం తరువాత పవన్ అల్ట్రా స్టైలిష్ గా కనిపించాడు. ఐకి ఈ సాంగ్ చూసాక అభిమానులకు ధైర్యం వచ్చేసింది. కచ్చితంగా OG హిట్ అందుకుంటుందని, సుజీత్ ఈసారి ఇండస్ట్రీని షేక్ చేయడానికి సిద్ధమవుతున్నాడని, ఈ సాంగ్ లో పవన్ ను చూశాకా.. సుజీత్ కు గుడి కట్టినా తప్పులేదయ్యా అని కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమాతో పవన్ - సుజీత్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.