AP Deputy CM: మీ సేవా గుణమే జనసేన పార్టీకి స్ఫూర్తి
ABN , Publish Date - Sep 02 , 2025 | 03:17 PM
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు (Ap Deputy Cm) పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిసిన తన అన్నయ్య చిరంజీవికి (Chiranjeevi) ఆయన కృతజ్ఞతలు చెప్పారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు (Ap Deputy Cm) పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిసిన తన అన్నయ్య చిరంజీవికి (Chiranjeevi) ఆయన కృతజ్ఞతలు చెప్పారు. ‘దీర్ఘాయుష్మాన్ భవా’అంటూ అరుదైన ఫొటోతో పవన్ కల్యాణ్‌కు చిరంజీవి విష్ చేసిన సంగతి తెలిసిందే! ఆయన ట్వీట్‌కు పవన్ స్పందించారు. ‘మీరు నేర్పిన సేవా గుణమే జనసేన పార్టీకి స్ఫూర్తి అంటూ చిరుకు పవన్ థాంక్స్ చెప్పారు.
‘నా జీవితానికి మార్గదర్శి, తండ్రి సమానులైన అన్నయ్య, పద్మవిభూషణ్ చిరంజీవికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీ ఆశీస్సులు, ప్రేమాభిమానాలు మీ శుభాకాంక్షలు నాకు ఎంతో ఆనందాన్నిచ్చాయి. సమాజానికి ఏదైనా చేయాలని మీరు నేర్పిన సేవా గుణమే ఈరోజు జనసేన పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేసేందుకు స్ఫూర్తినిచ్చింది. మీరు ఎప్పుడూ సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని, నాతోపాటు కోట్లాది మందికి మార్గదర్శకుడిగా నిలవాలని కోరుకుంటున్నా’ అంటూ చిరంజీవికి పవన్ థాంక్స్ చెప్పారు. అలాగే ఆయనకు శుభాకాంక్షలు చెప్పిన సినీ, రాజకీయా ప్రముఖులకు పేరుపేరున రిప్లై ఇస్తూ కృతజ్ఞతలు చెబుతున్నారు.