Pawan Kalyan: ఇప్పటివరకు నా మనసుకు నచ్చిన పాత్ర లేదు 

ABN , Publish Date - Jun 22 , 2025 | 03:41 PM

ఇండస్ట్రీలో నటించే ఏ నటీనటులకు అయినా తమ సినిమాల్లో ఏదో ఒక  పాత్ర సంతృప్తిని ఇస్తుంది.

Pawan Kalyan

Pawan Kalyan: ఇండస్ట్రీలో నటించే ఏ నటీనటులకు అయినా తమ సినిమాల్లో ఏదో ఒక  పాత్ర సంతృప్తిని ఇస్తుంది. ఆ పాత్ర తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అని కానీ, అది తన కెరీర్ మొత్తం గుర్తుండిపోతుంది అని చెప్పుకొస్తారు. కానీ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కు మాత్రం ఇప్పటివరకు ఆయన చేసిన పాత్రల్లో ఏ పాత్ర  కూడా పూర్తిగా తన మనసుకు నచ్చలేదు అని చెప్పుకొచ్చాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం  ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలను నిర్వర్తిస్తూనే ఇంకోపక్క  సైన్ చేసిన సినిమాలను ఫినిష్ చేస్తున్నాడు. 


ఇప్పటికే హరిహర వీరమల్లు(HariHara Veeramallu), ఓజీ(OG) సినిమాలను ఫినిష్ చేసిన పవన్.. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) తో బిజీగా మారాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది.  తాజాగా ఒక ఇంటర్వ్యూలో పవన్ మాట్లాడుతూ.. 'ఇప్పటివరకు నేను నటించిన పాత్రల్లో ఏది కూడా నా మనసుకు దగ్గర అయ్యింది లేదు. ప్రతి పాత్రలో కొన్ని లక్షణాలు మాత్రమే నాకు నచ్చాయి. నిజ జీవితంలో నేను ఎలా ఉంటానో.. సినిమాలో కూడా అలా కనిపించాలని నా కోరిక. కానీ, అది సినిమాల్లో సాధ్యపడదు.  ప్రేక్షకులు కూడా దానిని అంగీకరించరు.


సినిమాల్లోకి రావాలని నేనెప్పుడూ అనుకోలేదు. మా నాన్న ఒక ప్రభుత్వ ఉద్యోగి. మాది మధ్యతరగతి కుటుంబం.  మా నాన్నకు కమ్యూనిస్ట్ భావాలు ఎక్కువ. ఆయన వలనే నాకు రాజకీయ అవగాహన వచ్చింది. సినిమాల్లో నేను అనుకోకుండా వచ్చినా నా దృష్టి మొత్తం సమాజంపైనే ఉండేది. ఆ ఆలోచనతోనే నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఇక పవన్ బాలీవుడ్ సినిమాల గురించి కూడా చెప్పుకొచ్చాడు. అంతకుముందు లా ఇప్పుడు బాలీవుడ్ లేదని, మంచి మంచి కథలతో ప్రేక్షకులను వారు మెప్పించలేకపోతున్నారు.  దంగల్ లాంటి సినిమాలు ఇప్పుడు బాలీవుడ్ లో కనిపించడం  లేదు అని పవన్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం  ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. 

Vijay Devarakonda: విజయ్ దేవరకొండపై.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

Updated Date - Jun 22 , 2025 | 03:41 PM