OG: కిస్ కిస్ బ్యాంగ్‌ బ్యాంగ్.. స్పెష‌ల్ సాంగ్ వ‌చ్చేసింది! ఇక.. థియేట‌ర్ల బాక్పులు బ‌ద్ద‌లే

ABN , Publish Date - Sep 30 , 2025 | 10:43 PM

ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓజీ సినిమాలో టీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి నటించిన కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ స్పెష‌ల్ సాంగ్ మంగళవారం ఈవినింగ్ షో నుంచి థియేట‌ర్ల‌లో జోడించబడింది.

OG

గ‌త వారం థియేట‌ర్ల‌కు వ‌చ్చి ప్ర‌పంచ వ్యాప్తంగా రికార్డులు సృష్టిస్తోన్న చిత్రం ఓజీ (OG). సుజిత్ ద‌ర్వ‌క‌త్వంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) న‌టించిన ఈ సినిమా విడుద‌లైన అన్ని చోట్ల నుంచి అదిరే రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. ఈ నేప‌థ్యంలో ఈ వేగాన్ని మ‌రింత‌గా పెంచుతూ ఇప్ప‌టికే అన్ని ప్రాంతాల‌లో టికెట్ రేట్ల‌ను సాధార‌ణ స్థితికి తీసుకు వ‌చ్చారు.

అది అలా ఉండ‌గానే ఇప్పుడు తాజాగా మంగ‌ళ‌వారం ఈవినింగ్ షో నుంచి టీజే టిల్లు ఫేమ్ రాధిక (నేహా శెట్టి) (Neha Shetty) పై చిత్రీక‌రించిన‌ కిస్ కిస్ బ్యాంగ్‌ బ్యాంగ్ (Kiss Kiss Bang Bang) అంటూ సాగే స్పెష‌ల్ సాంగ్‌ను అన్ని థియేట‌ర్లలో జ‌త చేశారు. ఈ పాట కూడా క‌ల‌వ‌డంతో థియేట‌ర్ల‌లో మారు మ్రోగుతున్నాయి.

OG

కాగా ఈ పాట‌ను ఓజీ గాయ ప‌డి చికిత్స పొందుతున్న‌ప్పుడు ఓమీ గ్యాంగ్ సెల‌బ్రేట్ చేసుకునే పాట‌గా సెట్ చేశారు. పాట చూసిన వారంతా గ‌బ్బ‌ర్ సిగ్ డేస్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ థియేట‌ర్ల‌లో ఎగిరి గంతేస్తున్నారు.

Updated Date - Sep 30 , 2025 | 10:51 PM