OG: ఇదెక్కడి.. మాస్ బ్యాటింగ్‌రా మామ! ప్రపంచంలో రెండో అతిపెద్ద ఐమ్యాక్స్..నిమిషాల్లో హౌస్‌ఫుల్!
ABN , Publish Date - Sep 16 , 2025 | 03:56 PM
పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజి’ సినిమా ప్రపంచ రెండో అతిపెద్ద ఐమ్యాక్స్ స్క్రీన్‌లో నిమిషాల్లో హౌస్‌ఫుల్ అయ్యింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ ‘ఓజి’ (OG)పై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే కాదు, దక్షిణ భారతదేశం అంతటా భారీ ఓపెనింగ్స్ సాధించి రికార్డులు సృష్టించే అవకాశాలు ఈ చిత్రానికి మెండుగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. దేశంలోనే కాదు, విదేశాల్లోనూ సినిమా టికెట్లు క్షణాల్లో అమ్ముడుపోతుండటమే ఇందుకు నిదర్శనం.
అంతర్జాతీయంగా కూడా ‘ఓజి’కు మంచి డిమాండ్ కనిపిస్తోంది. ఇటీవల యుఎస్ మార్కెట్‌లో మిలియన్ల డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు నమోదు కాగా, తాజా అప్డేట్ ప్రకారం ప్రపంచంలో రెండో అతిపెద్ద ఐమ్యాక్స్ స్క్రీన్ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ ఐమ్యాక్స్ (Melbourne IMAX)లో ‘ఓజి’ మూవీ టికెట్ బుకింగ్స్ ప్రారంభమైన నిమిషాల్లో హౌస్‌ఫుల్ అయి నిర్వాహకులను సైతం అవాక్కయ్యేలా చేసింది. దీంతో ప్రేక్షకుల నుంచి భారీ డిమాండ్ రావడంతో వెనువెంటనే అదనపు షో కూడా ఏర్పాటు చేయడం గమనార్హం.
ఈ చిత్రం కోసం థమన్ అందించిన సంగీతం సినిమాకు మరింత ఆకర్షణగా నిలుస్తోంది. ఇటీవల విడుదల చేసిన పాటలు, థీమ్ సాంగ్ సినిమా రేంజ్‌ను మరింతగా పెంచేశాయి. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రియాంకా మోహన్ ( Priyanka Mohan), ఇమ్రాన్ హాస్మీ కీలక పాత్రల్లో నటించారు. అయితే.. విడుదల తేదీ దగ్గర పడుతున్నకొద్దీ ‘ఓజీ’ (OG)పై ఆసక్తి మరింత పెరుగుతుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.