Pawan Kalyan: పవన్ కల్యాణ్.. క్రేజ్ అంటే ఇది!పిఠాపురమైనా.. అమెరికా అయినా!
ABN , Publish Date - May 18 , 2025 | 09:44 AM
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రేజ్ గురించి అప్పుడు ఇప్పుడు మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) క్రేజ్ గురించి అప్పుడు ఇప్పుడు మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం సినిమాలకు కాస్త విరామం ఇచ్చినా ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతుందే తప్ప ఇసుమంతైనా కూడా తరగడం లేదు. అందుకే మాములుగా.. అందరూ హీరోలకు అభిమానులు ఉంటారు.. కానీ పవన్‌కు మాత్రం భక్తులు ఉంటారనేమాట చాలా మంది అనేక సందర్భాల్లో పదేపదే అంటూ ఉంటుంటారు. అందుకు నిదర్శణమే ఇప్పుడు మనం చెప్పుకోబేయే అంశం.
ఇప్పటికే చాలామంది ఫ్యాన్స్.. తమకు పవన్ కల్యాణ్ అంటే ఎంత ఇష్టమో వివిధ సందర్భాల్లో వివిధ రకాలుగా ప్రదర్శిస్తూ తాము చాలా ప్రత్యేకమని నిరూపించుకున్నారు. కొందకు రక్తంతో చిత్రాలు గీసి మరి తమ అభిమానాన్ని చాటుకున్నారు. తాజాగా పుప్పాల నిహార్ (Puppala Nihar) అనే వీరాభిమాని కూడా తను పవన్‌కు ఎంత పెద్ద వీరాభిమానినో నిరూపించి మరోసారి అభిమానులంటే ఎలా ఉంటారో ప్రపంచానికి చూయించాడు. అయితే ఆది కూడా విదేశంలో ఉంటూ చేసిన ఈ పనికి తోటి అభిమానులు కాలర్లు ఎగరేస్తున్నారు.
అమెరికాలోని మిస్సోరి సెయింట్ లూయిస్ యూనివర్సిటీలో (Saint Louis University) మాస్టర్స్ చేస్తున్ననిహార్ ఇటీవల తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఈ సందర్భంగా యూనివర్సిటీలో నిర్వహించిన కాన్వకేషన్‌లో పాల్గొన్న నిహార్ తన భుజాలపై జనసేన సింబల్ ఉన్న రెడ్ కలర్ టవల్‌తో హాజరై పట్టా అందుకుని ఔరా అనిపించాడు. అంతేకాదు తాను వాడే కారు నంబర్ ప్లేట్ సైతం PSPK9 అని పెట్టుకుని అమెరికన్ రోడ్లపై హాల్చల్ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించి ఇటీవల సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి కూడా. ఇవి చూసిన వారంతా అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.