Pawan Kalyan: OG షూటింగ్ లో పవర్ స్టార్...

ABN, Publish Date - May 14 , 2025 | 05:15 PM

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 'ఓజీ' షూటింగ్ ఉన్నారు. ఈ సినిమా వర్క్ పూర్తి గానే 'ఉస్తాద్ భగత్ సింగ్' నూ ఆయన పట్టాలెక్కించే పనిలో ఉన్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులందరి కోరిక ఫలించే రోజు మరెంతో దూరంలో లేదు. పవన్ కళ్యాణ్‌ ఏ సభలో కనిపించినా... 'ఓజీ... ఓజీ' (OG) అంటూ గోల గోల చేస్తున్న ఫ్యాన్స్ కు ఆ మూవీ మేకర్స్ గ్రాండ్ అప్ డేట్ ఇచ్చారు. 'ఓజీ' షూటింగ్ ను తిరిగి ప్రారంభించామని చెప్పి ఖుషీ చేశారు. విశేషం ఏమంటే బుధవారం నాడు ఈ సినిమా షూటింగ్ లో పవన్ కళ్యాణ్‌ పాల్గొన్నారు. విజయవాడలో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఆయనపై దర్శకుడు సుజీత్ (Sujith) కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు.


ఇటీవల 'హరిహర వీరమల్లు' (Harihara Veeramallu) షూటింగ్ ను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్‌ 'ఓజీ' పై దృష్టి పెట్టారు. వీలైనంత త్వరగా దీన్ని కూడా కంప్లీట్ చేయాలని భావిస్తున్నారు. అలానే తాను కమిట్ అయిన మరో సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Sing) నూ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట. ఈ మధ్యలో వచ్చిన గ్యాప్ లో 'ఉస్తాద్ భగత్ సింగ్' దర్శకుడు హరీశ్‌ శంకర్ (Harish Shankar) ఆ సినిమా స్క్రిప్ట్ ను మరింత పకడ్బందీగా మలిచాడని ఫిల్మ్ నగర్ సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే జూన్ 12 నుండి ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని అంటున్నారు.

పవన్ కళ్యాణ్‌ ఇచ్చిన డేట్స్ ను బట్టి షూటింగ్ ను కంప్లీట్ చేసుకుని ఈ సినిమాలు ఒకదాని వెనుక ఒకటిగా జనం ముందుకు రాబోతున్నాయి. ఇందులో ముందుగా 'హరిహర వీరమల్లు' విడుదల కాబోతోంది. దీన్ని జూన్ 12న రిలీజ్ చేయడానికి నిర్మాత ఎ. ఎం. రత్నం సోదరుడు దయాకర్ రావు సర్వ సన్నాహాలు చేస్తున్నాడు. అలానే ఇదే యేడాది ద్వితీయార్థంలో 'ఓజీ' సినిమా విడుదల కాబోతోంది. సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయిన తర్వాత పక్కాగా దీని రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తారని అంటున్నారు. అలానే పవన్ కళ్యాణ్‌ ఇచ్చే డేట్స్ ను బట్టి 'ఉస్తాద్ భగత్ సింగ్' వచ్చే యేడాది ఏ సమయంలో వస్తుందనే దానిలో క్లారిటీ వస్తుందట. 'హరిహర వీరమల్లు'లో పవన్ కళ్యాణ్‌ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా చేస్తోంది. 'ఓజీ'లో ప్రియాంక మోహన్ హీరోయిన్. అలానే 'ఉస్తాద్ భగత్ సింగ్'లో శ్రీలీల పవన్ తో జతకడుతోంది.

Also Read: 100 Movies Milestone: సెంచరీ కొట్టిన వారెవరు...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 14 , 2025 | 05:15 PM