Pawan Kalyan: డైరెక్టర్ సుజిత్‌కు.. 'ఓజీ' కారు గిఫ్ట్
ABN , Publish Date - Dec 16 , 2025 | 01:00 PM
ఓజీ సినిమా ఘనవిజయం తర్వాత దర్శకుడు సుజీత్‌కు పవన్ కల్యాణ్ బ్లాక్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ గిఫ్ట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇటీవల థియేటర్లకు వచ్చి మంచి విజయం సాధించిన పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చిత్రం ఓజీ (OG). సాహో ఫేం సుజిత్ (Sujeeth) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం పవన్ అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టింది. సినిమా కూడా రూ.300 కోట్లకు పైగా సాధించి పవర్ స్టార్ కెరీర్‌లోనే టాప్ గ్రాసర్‌గా నిలిచింది. ఆపై రాజకీయాల్లో ఫుల్ బిజీ అయిన పవన్ మరలా సినిమాలపై దృష్టి సారించలేదు.

అయితే.. తాజాగా పవన్ కల్యాణ్ తనకు మరపురాని విజయాన్ని అందించిన దర్శకుడు సుజిత్‌కు ఓ ఖరీదైన బ్లాక్ కలర్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ (Land Rover Defender ) కారును గిఫ్ట్‌గా ఇచ్చి సర్‌ఫ్రైజ్ చేశాడు. తను దైవంగా ఎంతో గొప్పగా అభిమానించే హీరో నుంచి ఊహించని విధంగా అందిన బహుమతితో ఒకింత షాక్ కు గురైన సుజిత్ భావోద్వేగానికి గురయ్యారు.
ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నారు. ఇదే నా జీవితంలో బెస్ట్ గిఫ్ట్. మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. నా ప్రియమైన ఓజీ, కళ్యాణ్ గారు ఇచ్చిన ప్రేమ, ప్రోత్సాహం నాకు అన్నిటికంటే గొప్పది. చిన్నప్పటి నుంచి ఆయనకు ఫ్యాన్‌గా ఉండటం నుంచి ఈ ప్రత్యేకమైన క్షణం వరకు… ఎప్పటికీ రుణపడి ఉంటాను” అంటూ భావోద్వేగంగా రాసుకొచ్చారు. పవన్ కల్యాణ్‌తో కలిసి కొత్త కారుతో దిగిన ఫొటోలు కూడా ఆయన షేర్ చేశారు.

ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరూ ఓ లుక్కేయండి. ఇదిలాఉండగా ఇక ఇప్పుడు అందరి దృష్టి ‘ఓజీ: పార్ట్ 2’ మీదే ఉండగా, ఆ సినిమా సెట్స్‌పైకి ఎప్పుడు వెళుతుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.