OG Movie: ఎట్టకేలకు 'ఓజీ' ని పూర్తి చేసిన పవన్ కళ్యాణ్
ABN , Publish Date - Jun 07 , 2025 | 10:04 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా సుజీత్(Sujeeth) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఓజీ(OG).

OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా సుజీత్(Sujeeth) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఓజీ(OG). డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ సరసన ప్రియాంక మోహన్(Priyanka Mohan) నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ(Emraan Hashmi)ఈ సినిమాలో విలన్ గా నటిస్తుండగా.. అర్జున్ దాస్(Arjun Das), శ్రీయా రెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
గతేడాది సెప్టెంబర్ లోనే ఓజీ రిలీజ్ కావాల్సి ఉండగా ఇంకా షూటింగ్ పూర్తికాకపోవడంతో ఈ ఏడాది సెప్టెంబర్ కి వాయిదా పడింది. పదవి వచ్చాక పవన్ బిజీగా ఉండడంతో షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇక మధ్య మధ్యలో షూటింగ్ లో పాల్గొంటూ ఎట్టకేలకు పవన్ ఓజీ షూటింగ్ ను ఫినిష్ చేశాడు. ఈ సినిమా ఆఖరి షెడ్యూల్ ముగిసిందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
గంభీర షూటింగ్ ను ముగించాడు.. ఇక ఓజీ రిలీజ్ కు రెడీ అవుతుంది అంటూ మేకర్స్ తెలిపారు. ఎట్టకేలకు ఓజీ షూటింగ్ ఫినిష్ అవ్వడంతో పవన్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఓజీపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. కుర్ర డైరెక్టర్ సుజీత్.. పవన్ ను ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ గా చూపించనున్నాడు. సెప్టెంబర్ 25 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో పవన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.