Hari Hara Veera Mallu: వీరమల్లు స్పెషల్ షోస్.. పవన్ ఫ్యాన్స్ ట్వీట్ వార్
ABN , Publish Date - May 26 , 2025 | 11:20 AM
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన హిస్టారికల్ అడ్వెంచర్ చిత్రం హరిహరవీరమల్లు మరో పక్షం రోజుల్లో థియేటర్లలోకి రానుంది.
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటించిన హిస్టారికల్ అడ్వెంచర్ చిత్రం హరిహరవీరమల్లు (Hari Hara Veera Mallu). మరో పక్షం రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచారు. ఇప్పటికే విడుదల చేసిన పాటలు ఒకదాన్ని మించి మరోటి విజయ సాధించాయి. ఈక్రమంలో మేకర్స్ త్వరలో ట్రైలర్ విడుదల చేసేందుకు సిద్దమవుతుండగా ఫ్యాన్స్ మాత్రం సినిమా ఎప్పుడు విడుదలవుతుందా ఎప్పెడెప్పుడు చూద్దామా అనే జోష్‌లో ఉన్నారు.
సుమారు రెండేండ్ల విరామం తర్వాత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుండడంతో అభిమానుల ఆనందం ఓ పట్టాన ఆపలేని విధంగా, పట్ట లేని పరిస్థితి ఉంది. మూవీ విడుదలకు ఇంకా అటు ఇటుగా 20 రోజులు ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఇప్పటి నుంచే పెద్ద హంగామే చేస్తున్నారు. హరిహరమల్లు సినిమా ట్యాగ్‌ను ట్రెండింగ్‌లో ఉంచుతూ క్రమం తప్పకుండా పోస్టింగులతో రచ్చ చేస్తు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందిస్తూ టికెట్ రేట్ల పెంపునకు, ప్రత్యేక షోల కోసం ఇచ్చేయండి సార్.. మన తెలంగాణ నేపథ్య సినిమా సార్.. పర్మిషన్ ఇచ్చేయండి సార్ ఎలాంటి ఇష్యూలు లేకుండా సెలబ్రేట్ చేసుకుంటాం అంటూ పోస్టులు పెడుతున్నారు.
అయితే.. తాజాగా ఫ్యాన్స్ అంతా కలిసి హరహారవీరమల్లు సినిమా టికెట్ రేట్ల విషయంలో ప్రభుత్వం పా విషయాలను వదిలేసి ఈ సినిమా టికెట్లపై ప్రత్యేక రేట్లకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతూ #HHVMTGPermissions అంటూ ఫ్యాన్స్ పెద్దెత్తున సపరేట్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. దీంతో తెలంగాణ నలుమూలల నుంచి పవన్ ఫ్యాన్స్ వేలల్లో అదే పనిగా ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ఇందుకు సంబంధించి రేవంత్ రెడ్డి (Revanth Reddy), పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు. ఇద్దరి మధ్య ఉన్న స్నేహం కోసమైనా ఈ సినిమాకు స్పెషల్ పర్మిషన్లు ఇవ్వాలని కోరుకుంటున్నారు.
ఇంకా తగ్గి.. మాకు ఉండేవే కొన్ని కొన్ని ఆనందాలు అందులో ఈ ప్రత్యేక షోలంటే పిచ్చి, ఎలాగైనా అనుమతులు ఇవ్వండి అంటూ వేడుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకు చేరిందో తెలియదు గానీ ఫ్యాన్స్ మాత్రం ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ కోసం ఎదురు చేస్తున్నారు. మరి సీఎం రేవంత్ గతంలో ఇచ్చిన మాటను పక్కకు పెట్టి ప్రత్యేక షోలకు, రేట్ల పెంపునకు అనుమతిని ఇస్తారా లేదా అని తెలియాల్సి ఉంది. ఒకవేళ అనుమతులు ఇచ్చినా హైకోర్టు ఊరుకుంటుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.