Pakeezah: నటి పాకీజాకు పవన్‌ కళ్యాణ్‌ ఆర్థిక సాయం

ABN , Publish Date - Jul 01 , 2025 | 03:37 PM

నటి పాకీజా కష్టాలు, దీన స్థితి తెలిసి చలించిన పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan) 2 లక్షలు రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు.

హాస్య నటిగా పాకీజా (Pakeezah) అలియాస్‌ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారామె. ఆమె కష్టాలు, దీన స్థితి తెలిసి చలించిన పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan) 2 లక్షలు రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. మంగళగిరిలో జనసేన (Janasena) కార్యాలయంలో ఈ మొత్తాన్ని శాసన మండలిలో  విప్‌ పి. హరిప్రసాద్‌, పి.గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ పాకీజాకు అందజేశారు.

Paakeeza.jpg

పవన్‌ సాయానికి పాకీజా కృతజ్ఞతలు తెలిపారు. చిన్నవాడైనా ఎదురుగా ఉంటే కాళ్లు మొక్కుతానంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తన ఆర్థిక పరిస్థితి గురించి సోమవారం పవన్‌ కళ్యాణ్‌ కార్యాలయానికి తెలియజేశాననీ, తక్షణం స్పందించి తగిన విధంగా ఆర్థిక సాయం అందించారని ఆమె చెప్పారు. పవన్‌ కళ్యాణ్‌ కుటుంబానికి జీవితాంతం రుణపడి ఉంటానన్నారు పాకీజా. 

Updated Date - Jul 01 , 2025 | 03:43 PM