Pawan Kalyan: బాలకృష్ణకు.. పవన్ ప్రశంసలు
ABN , Publish Date - Aug 25 , 2025 | 10:42 AM
నందమూరి బాలకృష్ణకు (Nandamuri Balakrishna) తాజాగా అరుదైన గౌరవం దక్కిన విషయం తెలిసిందే.
నందమూరి బాలకృష్ణకు (Nandamuri Balakrishna) తాజాగా అరుదైన గౌరవం దక్కిన విషయం తెలిసిందే.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (World Book of Records) గోల్డ్ ఎడిషన్ (Gold Edition)లో ఆయన పేరు నమోదైంది. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఈ పురస్కారానికి ఎంపికైన తొలి నటుడిగా నిలిచారు బాలయ్య. సినీ ఇండస్ట్రీలో నటుడిగా 50 వసంతాలు పూర్తి చేసుకున్నారాయన. సినిమా ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవలను గుర్తించి ఆయనకు ఈ పురస్కారాన్ని అందించనున్నారు. (World Book of Records). ఈ నెల 30న బాలయ్యను ఈ పురస్కారంతో సత్కరించనున్నారు.
నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ తరుణంలో ఈ గుర్తింపు దక్కడం ఆయన కెరీర్‌కు ఓ మైల్‌స్టోన్ అనే చెప్పాలి. అయితే.. టాలీవుడ్‌కు బాలకృష్ణ చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. ఇప్పుడు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అభిమానులు, సెలెబ్రిటీలు బాలయ్యకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సైతం సోషల్ మీడియా ద్వరా బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన సినిమాకు చేసిన సేవలను కొనియాడారు.
ఈ సందర్భంగా.. ఆయన తన పోస్టులో బాలనటుడిగా తెలుగు చలన చిత్ర రంగంలోకి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నట వారసుడిగా అడుగుపెట్టి జానపదాలు, కుటుంబ కథా చిత్రాలు, యాక్షన్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ, నట జీవితంలో 50 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం పూర్తి చేసుకున్న తరుణంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ( లండన్) లో చోటు సాధించిన ప్రముఖ నటులు, హిందూపురం MLA, పద్మ భూషణ్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన మరిన్ని సంవత్సరాలు తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ, ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు.