Pawan Kalyan: ఉస్తాద్ సెట్స్‌లో పవన్
ABN , Publish Date - Jun 11 , 2025 | 05:35 AM
ఇటీవలే ‘హరిహర వీరమల్లు’ చిత్రం డబ్బింగ్ పనులు ముగించారు పవన్ కల్యాణ్. ఇప్పుడు ఆయన ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ చిత్రం సెట్స్‌లోకి అడుగుపెట్టారు. ఈ చిత్రం...

ఇటీవలే ‘హరిహర వీరమల్లు’ చిత్రం డబ్బింగ్ పనులు ముగించారు పవన్ కల్యాణ్. ఇప్పుడు ఆయన ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ చిత్రం సెట్స్‌లోకి అడుగుపెట్టారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ మంగళవారం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో మొదలైంది. పవన్‌కల్యాణ్‌తో పాటు ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. నెల రోజుల పాటు ఈ షెడ్యూల్ సాగనుంది. ఈ చిత్రంలో పవన్‌కు జోడీగా శ్రీలీల నటిస్తున్నారు. గతంలో పవన్‌కల్యాణ్‌తో ‘గబ్బర్‌సింగ్’ లాంటి బ్లాక్‌బస్టర్‌ను తెరకెక్కించిన హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. సంగీతం: దేవి శ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: అయనంక బోస్.