Akhanda2: ఇక బాక్సులు.. బ‌ద్ద‌ల‌వ్వాల్సిందే! వారిని రంగంలోకి దింపిన‌ త‌మ‌న్‌

ABN , Publish Date - Oct 13 , 2025 | 06:57 AM

బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘అఖండ 2: తాండవం’.

Akhanda2

బాలకృష్ణ (Nandamuri Balakrishna) కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘అఖండ 2: తాండవం’ (Akhanda2). గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘అఖండ’ చిత్రానికి ఇది కొనసాగింపు. ఎం. తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. డిసెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘అఖండ’ చిత్రానికి బాలకృష్ణ నటనతో పాటు తమన్ (Thaman) నేపథ్య సంగీతం సైతం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకొంది.

ఇప్పుడు మరోసారి ‘అఖండ 2’ కోసం తమన్‌ రంగంలోకి దిగారు. ఇటీవలే ఆయన ఈ చిత్రం బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ను ప్రారంభించారు. సంస్కృత శ్లోకాలను అద్భుతంగా పఠించే నైపుణ్యంతో ప్రసిద్ధి చెందిన పండిట్‌ శ్రవణ్‌ మిశ్రా (Pandit Shravan Mishra), పండిట్‌ అతుల్‌ మిశ్రా (Pandit Atul Mishra) సోదరులిద్ద‌రినీ తెర‌మీద‌కు తీసుకొచ్చారు. ఫ‌స్ట్ టైం సినిమాల‌కు ప‌రిచ‌యం చేస్తున్నారు. వారిరువురికి ఇప్ప‌టికే నిరాటంకంగా ఎంత‌సేపైనా, బేస్ వాయిస్‌తో శ్లోకాలు ప‌ఠిస్తారు అనే గొప్ప పేరుంది.

Akhanda2

ఈ నేప‌థ్యంలోనే.. శ్లోకాల‌కు, భ‌క్తికి అధిక ప్రాధాన్యం ఉన్న అఖండ‌2 సినిమా నేపథ్య సంగీతం కోసం ఇరువురు సొద‌రులు త‌మ‌ అద్భుతమైన గాత్రంతో సంస్కృత శ్లోకాలను, వేద మంత్రాలను పఠించనున్నారని తమన్‌ తెలిపారు. ఈ క్ర‌మంలో త‌మ‌న్ వారితో క‌లిసి దిగిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్నారు. ఈ చిత్రంలో సంయుక్త కథానాయిక. ఆది పినిశెట్టి విలన్‌ పాత్ర పోషిస్తున్నారు. హర్షాలి మల్హోత్రా కీలకపాత్రలో కనిపించనున్నారు.

Updated Date - Oct 13 , 2025 | 07:15 AM