Bad GirlZ: ఈ రేంజ్‌లో.. కైపెక్కిస్తున్నారేంటి! ఊ అంటావా మామ‌.. పాట‌ను మించి ఉందిగా!

ABN , Publish Date - Dec 17 , 2025 | 08:26 AM

బ్యాడ్ గ‌ర్ల్స్.. కానీ చాలా మంచోళ్ళు ఈ చిత్రం నుంచి లేలో లేలో (LELOO Video Song) అంటూ ఔట్ అండ్ ఔట్ క‌పుల్ రొమాంటిక్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు.

Bad Girlz

అంచల్ గౌడ (Anchal), పాయల్ చెంగప్ప (Payal Chengappa), రోషిణి (Roshni Sahota), యష్ణ ముత్త‌లూరి (Yashnae Muthuluri), రోహన్ సూర్య (Rohan Surya), మొయిన్ (Mohi) ప్ర‌ధాన జంట‌లుగా రూపొందిన రొమాంటిక్ కామెడీ సినిమా బ్యాడ్ గ‌ర్ల్స్.. కానీ చాలా మంచోళ్ళు (Bad GirlZ). ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ క్రిస్మ‌స్ సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 25న ప్రేక్ష‌కుల ఎదుట‌కు రానుంది.

ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే విడుద‌ల చేసిన పాట‌లు, టీజ‌ర్‌, ట్రైల‌ర్ అన్నీ మూవీపై మంచి అంచ‌నాల‌ను తీసుకు వ‌చ్చాయి. గ‌తంలో యాంక‌ర్ ప్ర‌దీప్ మాచిరాజు హీరోగా గతంలో ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాను తెరకెక్కించిన ఫణి ప్రదీప్ (Phani Pradeep) ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

ఈ క్ర‌మంలో తాజాగా ఈ సినిమా నుంచి లేలో లేలో (LELOO Video Song) అంటూ ఔట్ అండ్ ఔట్ క‌పుల్ రొమాంటిక్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. భార్య‌ల‌ను రెచ్చ‌గొడుతూ భ‌ర్త‌లు మ‌రోక‌రితో ఆడి, పాగే పాటగా ఈ గీతాన్ని కైపెక్కిచ్చేలా తెర‌కెక్కించారు.

ఈ పాట‌కు అస్కార్ విన్న‌ర్ చంద్ర‌బోస్ (Chandrabose) సాహిత్యం అందించ‌గా అనూప్ రూబెన్స్ (Anup Rubens) సంగీతం కూర్చారు. ఊ అంటావా మామ సాంగ్‌ ఫేమ్ ఇంద్రావ‌తి చౌహాన్ (Indravati Chauhan) ఈ గీతాన్ని ఆల‌పించింది. అయితే.. పాట వింటూ ఉంటే.. పుష్ప రెండు సినిమాల‌లోని స్పెష‌ల్ సాంగ్స్‌ను గుర్తు చేసేలా అర్థ‌వంతంగా ఉంది.

Updated Date - Dec 17 , 2025 | 08:26 AM