One/4 Movie: కామెడీ థ్రిల్లర్ 'వన్ జై ఫోర్ ట్రైల‌ర్‌

ABN , Publish Date - Dec 03 , 2025 | 11:59 AM

కొత్త జంట వెంకటేశ్ పెదపాలెం – అపర్ణ మల్లిక్ నటించిన క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ‘One/4’ ట్రైలర్ విడుదలైంది.

1/4

నూతన నటీనటు లతో సరికొత్త తరహాలో తెరకెక్కిన కామెడీ థ్రిల్లర్ 'వన్ జై ఫోర్ (One/4 ). వెంకటేశ్ పెదపాలెం (Venkatesh Peddapalem) అపర్ణ మల్లిక్ (Aparnna Mallik)జంటగా నటించారు. బాహుబలి పళని కె. (Bahubali Palani.k) దర్శకత్వంలో రంజన రాజేశ్ గుంజల్, రోహిత్ రాందాస్ గుంజల్ సంయుక్తంగా నిర్మించారు. ఈ నెల 12న విడుదలవుతోంది. మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది..

ఈ సందర్భంగా వెంకటేశ్ పెద్దపాలెం మాట్లాడుతూ కొత్త తరహా కథాంశంతో ఈ క్రైమ్ డ్రామాను తీశాం. పణి గారి టేకింగ్ సినిమాకు ప్రత్యేకాకర్షణ. 'హారర్, సస్పెన్స్ అంశాలు. పోరాట ఘట్టాలు చాలా బావుంటాయి అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ క్రైమ్ ఆంశాలతో పాటు మానవ సంబంధాలను చర్చిస్తూ సందేశాత్మకంగా సాగే చిత్రమిది. పతాక ఘట్టాలే సినిమాకు హైలెట్ అని చెప్పారు. కథ మీద నమ్మకంతో ఈ చిత్రాన్ని నిర్మించాం. ప్రేక్షకులు ఆశించే అంశా లతో ఆసక్తికరంగా సాగుతుంది అని నిర్మాతలు తెలిపారు.

Updated Date - Dec 03 , 2025 | 11:59 AM