One by four: నోరు జారితే ఎదురయ్యే పరిణామాల నేపథ్యంలో..
ABN , Publish Date - Jul 26 , 2025 | 10:36 PM
బాహుబలి పళని (Bahubali palani) దర్శకత్వంలో, వెంకటేష్ పెద్దపాలెం, అపర్ణ మల్లిక్, హీనా సోని హీరో, హీరోయిన్స్ గా నటిస్తున్న యాక్షన్-క్రైమ్ డ్రామా చిత్రం ‘వన్ బై ఫోర్’
బాహుబలి పళని (Bahubali palani) దర్శకత్వంలో, వెంకటేష్ పెద్దపాలెం, అపర్ణ మల్లిక్, హీనా సోని హీరో, హీరోయిన్స్ గా నటిస్తున్న యాక్షన్-క్రైమ్ డ్రామా చిత్రం ‘వన్ బై ఫోర్’ (One by four) తేజస్ గుంజల్ ఫిలిమ్స్ , రోహిత్ గుంజల్ ఫిలిమ్స్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతుంది. టెంపర్ వంశీ, ఆర్ ఎక్స్ 100 కరణ్ విలన్స్ గా నటిస్తున్నారు. బాహుబలి చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసిన బాహుబలి పళని కె ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రంజన రాజేష్ గుంజల్ మరియు రోహిత్ రాందాస్ గుంజల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీ తో సిద్ధంగా ఉంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్ లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్.
ఈ సందర్భంగా దర్శకుడు నిర్మాతలు మాట్లాడుతూ " వన్ బై ఫోర్ (one/4) ఒక యాక్షన్ క్రైమ్ డ్రామా చిత్రం. షూటింగ్ మొత్తం వైజాగ్ లో జరిగింది. నోరు జారితే జరిగే పరిణామాలు వాటివల్ల వచ్చే సమస్యలు ఎలా ఉంటాయో చెప్పే కథే ఈ సినిమా. సినిమా చాలా కొత్తగా ఫ్రెష్ గా ఉంటుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో అద్భుతమైన క్రైమ్ యాక్షన్ సన్నివేశాలతో రూపొందించాం. టీజర్ మరియు పాటలు టి సిరీస్ యూట్యూబ్ లో విడుదల చేసాము. మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా క్రేజీ గా కొత్త గా ఉంటుంది, సెప్టెంబర్ విడుదల చేస్తాం' అని తెలిపారు.
ALSO READ:
Sobhan Babu: బ్లాంక్ చెక్ ఇచ్చినా మహేష్ కు తాతగా చేయను
Pawan Fans in London: మీ రూల్స్ ఎవరికి చెప్పారు.. ఎక్కడ పెట్టారు..
Shruti Haasan: ఆ ఫెయిల్యూర్స్ నా వల్ల జరగలేదు.. కానీ నింద నాపైనే..
Tanushree Dutta: సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్‌లా చంపే ప్లాన్‌లో..