Balakrishna, Krish Jagarlamudi: అబ్బబ్బ.. బాలయ్య ఏం ఫ్లాన్ చేశాడు! బాక్సులు బద్దలే
ABN, Publish Date - May 05 , 2025 | 08:55 PM
తెలుగునాట మరోసారి ఆసక్తికరమైన కాంబినేషన్ తెరమీదకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. బాలకృష్ణ, క్రిష్ జాగర్లమూడి కలయికలో ముచ్చటగా మూడో చిత్రం రూపుదిద్దుకోనుంది.
తెలుగునాట మరోసారి ఆసక్తికరమైన కాంబినేషన్ తెరమీదకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. బాలకృష్ణ (Nandamuri Balakrishna), క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) కలయికలో ముచ్చటగా మూడో చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో గౌతమి పుత్రశాతకర్ణి, ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాలు రాగా ఇప్పుడుమరోమారు కలిసి ఓ చిత్రం చేసేందుకు సిద్ధమయ్యారు. అంతేకాదు ఈ సినిమాతోనే బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ (Mokshagna Teja) ను కూడా తెరంగేట్రం చేయించనున్నట్లు తెలుస్తోంది. పైగా ఈ సినిమాను బాహుబలి సినిమాను నిర్మించిన అర్కా మీడియా నిర్మించనున్నట్లు సమాచారం.
ఇదిలాఉంటే.. హనుమాన్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని అందించిన ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ ఎంట్రీ ఉండాల్సి ఉండగా షూటింగ్ మొదలు కావాల్సిన ఓ రోజు ముందు ఆది రద్దు కావడం కాస్త చర్చ నీయాంశం కూడా అయింది. ఆ తర్వాత మళ్లీ కొత్త తేదీలు ప్రకటిస్తామని తెలిపినప్పటికి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. తీరా ఇన్నాళ్లకు మోక్షు ఆరంగేట్రం సినిమాపై అప్‌డేట్ రావడంతో నందమూరి అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. అయితే ఈ సినిమా బాలయ్య ముందు నుంచి అనుకుంటున్న ఆదిత్య999 కథనా లేక వేరే కొత్త కథేదైనా ఉంటుందని తెలియాల్సి ఉంది.
మరోవైపు క్రిష్ ఇప్పుడు అనుష్క షెట్టితో ఘూటీ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండగా బాలకృష్ణ బోయపాటితో అఖండ2 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ అనంతరం బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయనున్న చిత్రం జూన్‌లో ప్రారంభం కానుంది. ఈనేపథ్యంలో నవంబర్, డిసెంబర్‌లలో ఎప్పుడైనా ఈ చిత్రం పట్టాలెక్కనుంది. ఈ సినిమా షూటింగ్ మొదలైతే ఇక బాలయ్య, నందమూరి అభిమానులను అదుపు చేయడం, సినిమాపై ఏర్పడే బజ్ ఓ రేంజ్‌లో ఉండడం ఖాయం. చూడాలి భవిష్యత్‌లో ఇంకా ఎలాంటి అప్‌డేట్స్ వస్తాయో.