Onam Special: ఓనమ్‌ స్పెషల్‌ దీపావళి విడుదల

ABN , Publish Date - Sep 06 , 2025 | 06:06 AM

యువ కథానాయకుడు కిరణ్‌ అబ్బవరం తాజా చిత్రం ‘కె. ర్యాంప్‌’. జైన్స్‌ నాని దర్శకత్వంలో రాజేశ్‌ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యుక్తి తరేజా హీరోయిన్‌....

యువ కథానాయకుడు కిరణ్‌ అబ్బవరం తాజా చిత్రం ‘కె. ర్యాంప్‌’. జైన్స్‌ నాని దర్శకత్వంలో రాజేశ్‌ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యుక్తి తరేజా హీరోయిన్‌. కేరళ నేపథ్యంలో సాగే కథ కనుక ఓనమ్‌ పండగ సందర్భంగా ప్రత్యేక పోస్టర్‌ విడుదల చేశారు. సినిమాలో ఓనమ్‌ పండగ సెలబ్రేషన్స్‌తో సాగే పాటను ప్రత్యేకంగా చిత్రీకరించినట్లు నిర్మాతలు తెలుపుతూ దీపావళి సందర్భంగా అక్టోబర్‌ 18న చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేస్తామని ప్రకటించారు. అలాగే మ్యూజిక్‌ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ నెల 9న లవ్‌ మెలోడీ సాంగ్‌ ‘కలలే.. కలలే’ ను విడుదల చేస్తామని చెప్పారు. నరేశ్‌, సాయికుమార్‌, వెన్నెల కిశోర్‌ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.

Updated Date - Sep 06 , 2025 | 06:06 AM