Mass Jathara: మాస్ జాతరలో ఓలే.. ఓలే..
ABN , Publish Date - Aug 06 , 2025 | 02:25 AM
రవితేజ కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం మాస్ జాతర భాను భోగవరపు దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ
రవితేజ కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీలీల కథానాయిక. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ చిత్రంపై భారీ అంచనాలను పెంచేసింది. మొదటి గీతంగా విడుదలైన ‘తు మేరా లవర్’ అందర్నీ ఉర్రూతలూగించింది. ఇప్పుడు రెండో గీతంగా ‘ఓలే ఓలే...’ని విడుదల చేసింది చిత్రబృందం. రవితేజ- శ్రీలీల పోటా పోటీగా నర్తించి పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు. భాస్కర్ యాదవ్ దాసరి సాహిత్యానికి భీమ్స్ సిసిరోలియో తనదైన శైలిలో స్వరపరిచారు.