Oh Bhama Ayyo Rama Trailer: ఆసక్తికరంగా ఓ భామ అయ్యో రామ ట్రైలర్
ABN , Publish Date - Jul 05 , 2025 | 01:25 PM
కలర్ ఫోటో సినిమాతో హీరోగా మారాడు సుహాస్ (Suhas). ఈ సినిమా జాతీయ అవార్డును కూడా అందుకోవడంతో సుహాస్ పేరు టాలీవుడ్ లో మారుమ్రోగింది.
Oh Bhama Ayyo Rama Trailer: కలర్ ఫోటో సినిమాతో హీరోగా మారాడు సుహాస్ (Suhas). ఈ సినిమా జాతీయ అవార్డును కూడా అందుకోవడంతో సుహాస్ పేరు టాలీవుడ్ లో మారుమ్రోగింది. ఇక కలర్ ఫొటో తరువాత విభిన్నమైన కథలను ఎంచుకుంటూ మంచి విజయాలను అందుకున్నాడు. కేవలం హీరోగానే కాకుండా విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా కనిపించాడు. అయితే ఈ మధ్యకాలంలో కేవలం హీరోగానే సినిమాలు చేస్తూ బిజీగా మారాడు. ప్రస్తుతం సుహాస్ నటిస్తున్న చిత్రాల్లో ఒకటి ఓ భామ అయ్యో రామ (Oh Bhama Ayyo Rama).
రామ్ గోదాల దర్శకత్వంలో తెరకెక్కిన ఓ భామ అయ్యో రామ సినిమాలో సుహాస్ సరసన మాళవిక మనోజ్ హీరోయిన్ గా నటించగా.. చాలాకాలం తరువాత నువ్వు నేను సినిమా హీరోయిన్ అనిత ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
డైరెక్టర్ అవ్వాలనికలలు కనే యువకుడు రామ్. తన కలను నిజం చేసుకొనే సమయంలో అతనికి ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. అయితే ఆ అమ్మాయి రాకముందు ఒకలా ఉన్న రామ్.. ఆ అమ్మాయి వచ్చాకా అతనిలో మార్పు వస్తుంది. మరి వీరి ప్రేమకు అడ్డుపడింది ఎవరు.. ? రామ్ గతం ఏంటి.. ? చివరకు రామ్ డైరెక్టర్ అయ్యాడా.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ట్రైలర్ లో కామెడీతో పాటు అమ్మ సెంటిమెంట్ ను కూడా బాగా చూపించారని తెలుస్తోంది. హీరోకు తల్లిగా అనిత కనిపించింది. ఇక ఎప్పుడు కామెడీతో అలరించే ఆలీ.. ఈ సినిమాలో ఎమోషనల్ డైలాగ్స్ తో కన్నీరు తెప్పించేలా ఉన్నాడు. రాధాన్ మ్యూజిక్ సినిమాకు హైలైట్ గా మారనుంది. ఇకపోతే ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతోంది. మరి ఈ సినిమాతో సుహాస్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.