O Bhama Ayyyo Rama: ప్రేక్షకులను మెప్పించే ప్రేమకథ

ABN , Publish Date - Jul 07 , 2025 | 02:52 AM

సుహాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘ఓ భామ అయ్యో రామ’. మలయాళ నటి మాళవికా మనోజ్‌ కథానాయికగా...

సుహాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘ఓ భామ అయ్యో రామ’. మలయాళ నటి మాళవికా మనోజ్‌ కథానాయికగా పరిచయమవుతున్నారు. రామ్‌జీ దర్శకుడు. హరీశ్‌ నల్ల నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు హరీశ్‌ శంకర్‌ అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఈనెల 11న ‘ఓ భామ అయ్యోరామ’ విడుదలవుతోంది. ఇటీవలె నిర్వహించిన కార్యక్రమంలో చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘సుహాస్‌ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రమిది. చక్కని ప్రేమకథతో రూపొందించాం. ప్రతి సన్నివేశం ప్రేక్షకులను అలరిస్తుంది. కొత్త అనుభూతిని ఇస్తుంది’ అని చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ ‘సినిమా మేకింగ్‌లో రాజీ పడలేదు. మంచి అవుట్‌పుట్‌ వచ్చింది. పాటలు, ఆకట్టుకునే రొమాంటిక్‌ సన్నివేశాలు, అందరినీ కట్టిపడేసే భావోద్వేగాలు ఈ చిత్రంలో మిళితమై ఉన్నాయి’ అని చెప్పారు.

Updated Date - Jul 07 , 2025 | 02:56 AM