O Andala Rakshasi: జనవరి 2న .. థియేటర్లకు ‘ఓ అందాల రాక్షసి’
ABN , Publish Date - Dec 29 , 2025 | 10:31 AM
‘ఓ అందాల రాక్షసి’ చిత్రంతో హీరోగా, దర్శకుడిగా మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు షెరాద్ మెహదీ.
‘ఓ అందాల రాక్షసి’ (O Andala Rakshasi) చిత్రంతో హీరోగా, దర్శకుడిగా మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు షెరాద్ మెహదీ (Sheraz Mehdi). విహాన్షి హెగ్డే (Vihanshi Hegde), కృతి వర్మ (Kriti Verma) కథానాయికలు. మంచి సందేశాత్మక కథనంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని స్కై ఈజ్ ది లిమిట్ బ్యానర్‌పై సురీందర్ కౌర్ నిర్మించారు. జనవరి 2న ప్రేక్షకుల ముందుకు రానుంది
. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో షెరాజ్ మెహదీ మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో తమ్మారెడ్డి భరద్వాజ గారు అద్భుతమైన పాత్రను పోషించారు. మంచి కంటెంట్‌తో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక్క నిమిషమైనా విసుగు అనిపించదు. అమ్మాయిలకు నచ్చే చిత్రమిది’ అని అన్నారు. నిహాన్షి హెగ్డే మాట్లాడుతూ ‘అమ్మాయిల్ని మోసం చేస్తే.. ఆ అందం రాక్షసిగా మారుతుంది. అదే మా ‘ఓ అందాల రాక్షసి’ చిత్ర కథ’ అని చెప్పారు.