Nuvvu Naaku Nachav: మళ్ళీ మరొక్కసారి.. 'నువ్వు నాకు నచ్చావ్'! ట్రైలర్ రిలీజ్
ABN , Publish Date - Dec 25 , 2025 | 07:20 PM
వెంకటేశ్, ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన చిత్రం 'నువ్వు నాకు నచ్చావ్'. జనవరి 1న మూవీ రిలీజ్ అవుతున్న సందర్భంగా తాజాగా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
విక్టరీ వెంకటేశ్, ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన క్లాసిక్ మూవీ 'నువ్వు నాకు నచ్చావ్'. త్రివిక్రమ్ కథ, మాటలు అందించిన ఈ సినిమాకు కె. విజయభాస్కర్ దర్శకుడు. సురేశ్ బాబు సమర్పణలో స్రవంతి రవికిశోర్ నిర్మించిన 'నువ్వు నాకు నచ్చావ్' మూవీ 2001 సెప్టెంబర్ లో విడుదలై ఘన విజయం సాధించింది. అంతేకాదు తమిళ, కన్నడ, బెంగాలీ భాషల్లో రీమేక్ అయ్యింది.
ప్రకాశ్ రాజ్, సుహాసిని, చంద్రమోహన్, సునీల్, ఆశా సైనీ, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, సుధ, హేమ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. కోటి అందించిన సంగీతం సినిమాను మ్యూజికల్ హిట్ గా నిలిపింది. ఇప్పుడీ సినిమాను 4కె లో బిగ్ స్క్రీన్ లో ప్రదర్శించబోతున్నారు. నూతన సంవత్సరం కానుకగా జనవరి 1న రీ-రిలీజ్ అవుతున్న 'నువ్వు నాకు నచ్చావ్' ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.