NTR: ఎన్టీఆర్‌లో ఏదో తెలియని ఆకర్షణ శక్తి ఉంది
ABN , Publish Date - Jun 11 , 2025 | 05:39 AM
జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కలసి నటించిన ‘వార్ 2’ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది. ఇటీవల విడుదల చేసిన టీజర్‌తో అంచనాలు అమాంతం పెరిగాయి. సినిమాలో ఎన్టీఆర్ లుక్, స్టైలింగ్ గురించి...
జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కలసి నటించిన ‘వార్ 2’ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది. ఇటీవల విడుదల చేసిన టీజర్‌తో అంచనాలు అమాంతం పెరిగాయి. సినిమాలో ఎన్టీఆర్ లుక్, స్టైలింగ్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ‘వార్ 2’ చిత్రానికి అనైతా ష్రాఫ్ అడజానియా కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా పని చేశారు. సినిమాలో ఆయన లుక్, ఇతర విషయాల గురించి అనైతా వివరిస్తూ ‘ఎన్టీఆర్‌తో తొలిసారిగా కలసి పనిచేయడం ఆనందంగా అనిపించింది. ఆయన సెట్స్‌లోకి ఎంట్రీ ఇస్తే ఆ ఎనర్జీ అందరిలోకి ప్రవేశిస్తుంది. ఆయనలో ఏదో తెలియని ఆకర్షణ శక్తి ఉంది. తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఆయన ఎంతో ఉల్లాసంగా ఉంచుతారు. ‘వార్ 2’లో ఆయన పోషిస్తున్న పాత్రలో ఎన్నో రకాల లేయర్స్ ఉంటాయి. అందుకే చాలా లుక్స్ డిజైన్ చేశాం. ఆయన పాత్ర స్వభావాన్ని ప్రతిబింబించేలా కాస్ట్యూమ్స్ డిజైన్ చేశాం. ఓ లక్ష్యంతో పని చేసే మానవ యంత్రంలా ఆయన్ని చూపించే ప్రయత్నం చేశాం’ అన్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఆదిత్య చోప్రా ‘వార్ 2’ చిత్రాన్ని నిర్మించారు.