NTR: గంగిరెడ్డి.. అల్లుడు అదిరిపోయాడు..రాసి పెట్టుకో

ABN , Publish Date - Dec 07 , 2025 | 05:08 PM

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) లుక్ గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. సాధారణంగా హీరోలు ఒక సినిమా కోసం బరువు పెరగడం, తగ్గడం చేస్తూనే ఉంటారు.

NTR

NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) లుక్ గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. సాధారణంగా హీరోలు ఒక సినిమా కోసం బరువు పెరగడం, తగ్గడం చేస్తూనే ఉంటారు. దేవర కోసం ఎన్టీఆర్ బరువు పెరిగాడు.. తగ్గాడు. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ (Prashanth Neel) తో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాకు డ్రాగన్ (Dragon) అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేసినట్లు వార్తలు వచ్చినా అది నిజం కాదని నిర్మాత చెప్పడంతో అందరూ ఈ సినిమాను ఎన్టీఆర్ నీల్ గానే పిలుస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) హీరోయిన్ గా నటిస్తోంది.

ఎన్టీఆర్ నీల్ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా కోసమే ఎన్టీఆర్ బరువు తగ్గినట్లు సమాచారం. అయితే ఆ బరువు కూడా అలా ఇలా కాదు.. అసలు ఎన్టీఆర్ యేనా అని ఆశ్చర్యపోయేలా తగ్గాడు. ఇది సినిమా కోసం తగ్గలేదని, తారక్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని వార్తలు వచ్చాయి. ముఖంలో కళ లేకపోవడం, పూర్తిగా పేషేంట్ లా మారిపోవడం చూసి అభిమానులు సైతం ఆందోళన పడ్డారు.

ఇక ఇప్పుడిప్పుడే ఎన్టీఆర్ కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. గత కొన్నిరోజుల క్రితం ఎన్టీఆర్ లుక్ తో పోలిస్తే ఇప్పుడు ఉన్న లుక్ కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. తాజాగా ఎన్టీఆర్ లేటెస్ట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. చైర్ లో కూర్చొని.. గుబురు గడ్డం, గాగుల్స్ తో మ్యాన్ ఆఫ్ మాసెస్ అనే పేరుకు తగ్గట్లు కనిపించాడు. కొద్దిగా ముఖంలో కళ కనిపిస్తుంది. ఇప్పుడు ఎన్టీఆర్ పాత లుక్ కి వచ్చేశాడని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. గంగిరెడ్డి.. అల్లుడు అదిరిపోయాడు.. రాసి పెట్టుకో.. ఎన్టీఆర్ నీల్ హిట్ ఖాయమని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమాతో ఎన్టీఆర్ ఏల్నాటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.

Updated Date - Dec 07 , 2025 | 05:22 PM