Bala Krishna: బాలయ్యకు తండ్రి అవార్డు.. ఏమన్నారంటే..
ABN , Publish Date - May 30 , 2025 | 05:07 PM
తెలంగాణ ప్రభుత్వం (TGS Govt) ప్రకటించిన గద్దర్ సినీ పురష్కారాల్లో (gaddar awards) భాగంగా తనకు ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు ప్రకటించడంపై నటుడు నందమూరి బాలకృష్ణ (NBK) ఆనందం వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం (TGS Govt) ప్రకటించిన గద్దర్ సినీ పురష్కారాల్లో (gaddar awards) భాగంగా తనకు ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు ప్రకటించడంపై నటుడు నందమూరి బాలకృష్ణ (NBK) ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. (NtR nationa award) 
‘‘ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు పూర్తి చేసుకున్న అద్భుతమైన సమయం ఒకవైపు.. ఎన్టీఆర్ నట ప్రస్థానానికి 75 సంవత్సరాల అమృతోత్సవాలు జరుగుతోన్న శుభ ఘడియలు మరోవైపు.. నటుడిగా నేను 50ఏళ్ల స్వర్ణోత్సవం పూర్తి చేసుకున్న శుభ సందర్బ?ం ఇంకొక వైపు.. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పద్మభూషణ్‌తో సత్కరించిన ఇలాంటి తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘ఎన్టీఆర్ జాతీయ అవార్డు’ ప్రకటించడం నా అదృష్టం. దీనిని దైవ నిర్ణయంగా, నా తండ్రి ఆశీర్వాదంగా భావిస్తున్నా. ఇలాంటి ప్రతిష్ఠాత్మకమైన పురస్కారానికి నన్ను ఎంపిక చేసిన తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు. ప్రపంచం నలుమూలలా ఉన్న తెలుగు ప్రజల దీవెనలు, భగవంతుడి ఆశీస్సులు నాకు ఎల్లవేళలా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా’’ అని బాలకృష్ణ అన్నారు.   
మరోవైపు, కాంతారావు ఫిల్మ్ అవార్డుకు ఎంపిక కావడంపై విజయ్ దేవరకొండ స్పందించారు. ‘‘నట ప్రపూర్ణ కాంతారావు ఫిల్మ్ అవార్డుకు ఎంపిక కావడం ఎంతో గౌరవంగా భావిస్తున్నా. ఈ అవార్డుకు ఎంపిక అయినందుకు సంతోషిస్తున్నా. నాపై నమ్మకం ఉంచి.. ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసిన తెలంగాణ ప్ఘ్రభుత్వానికి, జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు. 2016వ సంవత్సరానికి సంబంధించి రెండో ఉత్తమ చిత్రంగా ‘పెళ్ళి చూపులు’ ఎంపికేౖనందుకు ఆనందంగా ఉంది. ఈ సినిమా ఎప్పటికీ నా హృదయంలో ప్రత్యేక స్థ్థానాన్ని కలిగి ఉంటుంది’’ అని తెలిపారు. 
నందమూరి బాల కృష్ణ