NTR: డ్రాగన్.. విధ్వంసం కోసం సిద్ధం

ABN , Publish Date - Sep 16 , 2025 | 08:42 PM

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) ప్రస్తుతం డ్రాగన్ (Dragon) సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ప్రశాంత్ నీల్ (Prasanth Neel) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) నటిస్తోంది.

NTR

NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) ప్రస్తుతం డ్రాగన్ (Dragon) సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ప్రశాంత్ నీల్ (Prasanth Neel) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) నటిస్తోంది. ఈ సినిమా కోసం అభిమానులు మాత్రమే కాదు.. ఇండస్ట్రీ మొత్తం వేయికళ్లతో ఎదురుచూస్తుంది. దేవర తరువాత ఎన్టీఆర్ వార్ 2 తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. కానీ, ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. దీంతో ఎన్టీఆర్ ఈసారి ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. దానికోసమే చాలా కష్టపడుతున్నాడు.


డ్రాగన్ సినిమా ఇప్పటికే పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకొని సెట్స్ మీదకు వెళ్ళింది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ లుక్ మొత్తం మారుస్తున్నాడు. బొద్దుగా ఉన్నవాడు కాస్తా బరువు తగ్గి బక్కచిక్కి కనిపించాడు. అసలు ఒకానొక సమయంలో ఎన్టీఆర్ ను చూసి ఎవరు గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. అనారోగ్యంతో తగ్గాడో.. లేక సినిమా కోసం తగ్గాడో అన్న విషయం తెలియక అభిమానులు బుర్రలు బద్దలు కొట్టేసుకున్నారు.


ఇక తాజాగా ఎన్టీఆర్.. డ్రాగన్ కోసమే బరువు తగ్గి కండలు పెంచుతున్నట్లు అర్థమైంది. ఎట్టకేలకు ఎన్టీఆర్ జిమ్ లో కసరత్తులు చేస్తున్న ఒక వీడియోను మేకర్స్ అభిమానులతో పంచుకున్నారు. ప్రతి చెమట చుక్క విధ్వంసం కోసం నిర్మిస్తుందే అంటూ పవర్ ఫుల్ క్యాప్షన్ కూడా ఇచ్చారు. వీడియోలో ఎన్టీఆర్ బీస్ట్ లుక్ లో షర్ట్ తీసి.. చెస్ట్ వర్క్ అవుట్స్ చేస్తూ కనిపించాడు.. ఇక డ్రాగన్ ఎలా ఉండబోతుంది అనేది ఈ ఒక్క చిన్న శాంపిల్ చెప్పేస్తుంది అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం డ్రాగన్ షూట్ హైదరాబాద్ లో సైలెంట్ గా జరుగుతుందని టాక్. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో ఎన్టీఆర్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.

Robert Redford: ఆస్కార్ బెస్ట్ డైరెక్టర్ రాబర్ట్ రెడ్ ఫోర్డ్.. ఇక లేరు

Kanya Kumari OTT: స‌డ‌న్‌గా.. ఓటీటీకి లేటెస్ట్‌ ఫీల్‌గుడ్ లవ్ స్టోరీ! మీరూ ల‌వ్‌లో ప‌డిపోతారు

Updated Date - Sep 16 , 2025 | 08:42 PM