Ntr Dragon: RFCలో.. ఎన్టీఆర్‌ డ్రాగన్‌ యాక్షన్‌

ABN , Publish Date - Dec 13 , 2025 | 10:07 AM

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ (NTR) కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ (Prasanth Neel) ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ‘డ్రాగన్‌’ (dragon) వర్కింగ్‌ టైటిల్‌తో భారీ పీరియాడిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోంది.

NTR NEEL

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ (NTR) కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ (Prasanth Neel) ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ‘డ్రాగన్‌’ (dragon) వర్కింగ్‌ టైటిల్‌తో భారీ పీరియాడిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్‌ కథానాయిక.

కొంత గ్యాప్‌ తర్వాత ఈ చిత్రం షూటింగ్‌ మొదలైంది. తాజాగా రామోజీ ఫిల్మ్‌సిటీలో కొత్త షెడ్యూల్‌ను మొదలుపెట్టారు. ఎన్ఠీఆర్‌తో పాటు ప్రధాన పాత్రాధారులపై కీలక సన్నివేశాలు, యాక్షన్‌ ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు. దాదాపు మూడు వారాలు ఈ షెడ్యూల్‌ కొనసాగనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

ఈ సినిమా కోసం తారక్‌ మేకోవర్‌ మొత్తం మార్చేశారు. స్లిమ్‌గా తయారయ్యారు. ఇందులో ఆయన  రెండు భిన్నమైన లుక్స్‌లో కనువిందు చేయనున్నట్లు మొదటి నుంచి టాక్‌ నడుస్తోంది. వచ్చే ఏడాది జూన్‌ 25న ఈ సినిమా విడుదల కానున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. రవి బస్రూర్‌ సంగీతం అందిస్తున్నారు.

Updated Date - Dec 13 , 2025 | 10:39 AM