అభిమానుల గుండెల్లో ఎప్పటికీ ఎన్టీఆర్ ఉంటారు
ABN , Publish Date - Jun 18 , 2025 | 03:14 AM
నందమూరి తారకరామారావు సినీ వజ్రోత్సవ వేడుకలను విదేశాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ యూనివర్స్ సక్సెస్ సెలబ్రేషన్స్‌ను మంగళవారం హైదరాబాద్‌లో...
నందమూరి తారకరామారావు సినీ వజ్రోత్సవ వేడుకలను విదేశాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ యూనివర్స్ సక్సెస్ సెలబ్రేషన్స్‌ను మంగళవారం హైదరాబాద్‌లో జరిపారు. ఈ కార్యక్రమంలో నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ ‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు అభిమానుల గుండెల్లో ఎన్టీఆర్ ఎప్పటికీ ఉంటారు. ఆయన ఆశయాలను, స్ఫూర్తిని ఇలాంటి కార్యక్రమాల ద్వారా మరింతగా ప్రజలకు చేరువ చేయాలి’’ అని అన్నారు. ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ అధ్యక్షుడు టీడీ జనార్ధన్ మాట్లాడుతూ ‘‘ప్రపంచ సినీ చరిత్రలో ఎన్టీఆర్ వంటి గొప్ప నటుడు లేరు’’ అని చెప్పారు. నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ‘‘నటుడిగా, ప్రజానాయకుడిగా ఎన్టీఆర్ జీవితం అందరికీ ఆదర్శం. ఈ సినీ వజ్రోత్సవం ఇంత వేడుకగా జరుగుతున్నందుకు ఆనందంగా ఉంది’’ అని తెలిపారు.