NTR: 2000 మందితో యంగ్ టైగర్ బిగ్ ఫైట్..!
ABN , Publish Date - Jun 05 , 2025 | 04:51 PM
బాక్సా ఫీస్ కు డ్రాగన్ అప్పుడే దడ పుట్టిస్తోంది. జస్ట్ అప్డేట్స్ తోనే టాప్ లేపుతోంది. అసలే ఆటం బాంబులాంటి యాక్టర్, డైరెక్టర్ కావడంతో.. ఏ సీన్ ఎలా పేలుతుంది అని అభిమానులు లెక్కలు వేసుకుంటున్నారు. అందుకు తగ్గట్టే ఇప్పుడు ఓ క్రేజీ న్యూస్ తెరపైకి వచ్చింది
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబోలో వస్తున్న డ్రాగన్ (Dragon) సినిమా అప్డేట్స్ అభిమానుల్లో అంచనాలను ఆకాశానికి తాకేలా చేస్తున్నాయి. ప్రశాంత్ నీల్ ఈ సినిమాని నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్న రేంజ్లో తీర్చిదిద్దుతున్నాడు. ప్రతి సీన్నూ జాగ్రత్తగా తెరకెక్కిస్తూ ఫుల్ ఎనర్జీతో దూసుకెళ్తున్నాడు. ఇప్పుడు ఈ మూవీలో ఓ భారీ సీన్ గురించి ఇండస్ట్రీ ఎంతో ఆసక్తిగా మాట్లాడుకుంటుంది .
డ్రాగన్ ఓ మాస్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతోంది. ఎన్టీఆర్‌తో పాటు కీలక పాత్రల నటీనటులు సెట్స్‌పై చేస్తున్నారు. అయితే ఇందులో ఓ సీన్ కోసం ఏకంగా 2000 మంది జూనియర్ ఆర్టిస్టుల మధ్య తారక్ యాక్షన్ సీక్వెన్స్ లో పాల్గొంటున్నాడన్న మ్యాటర్ హాట్ టాపిక్ గా మారింది. ఇంత మంది ఆర్టిస్టులతో ఎన్టీఆర్ ఇప్పటి వరకూ ఏ సినిమాలోనూ పనిచేయలేదు. గతంలో ఆర్ఆర్ఆర్ (RRR)లో వందల్లో ఆర్టిస్టులతో సీన్స్ చేశాడు. కానీ ఇప్పుడు 2000 మంది అంటే ఈ సీన్ స్పెషల్ హైలైట్ అవ్వడం ఖాయమని అంటున్నారు.
మరోవైపు.. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ లుక్‌లో టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ చేశాడు. బాడీని సన్నగా, ఫిట్‌గా మార్చుకున్నాడు. స్పెషల్ డైట్ ఫాలో చేసి, వెయిట్ లాస్లో ఫుల్ ఫోకస్‌తో రూపం మార్చేశాడు. దీంతో తారక్ కొత్త లుక్ ఎలా ఉంటుంది అనే ఆసక్తి అభిమానుల్లో పీక్స్‌లో ఉంది. మీడియా కెమెరాల్లో ఎన్టీఆర్ కనిపించినా, డ్రాగన్ లుక్ గురించి హైప్ డబుల్ అవుతోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ కోసం ఫుల్ ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. డ్రాగన్ రిలీజ్ అయితే సినిమా థియేటర్లలో ఊచకోత ఖాయం అని ఫిక్స్ అయ్యారు.