NTR: ఎన్టీ రామారావు వీరాభిమాని.. ‘ఎన్టీఆర్ రాజు’ మృతి
ABN , Publish Date - Dec 18 , 2025 | 08:19 AM
దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు వీరాభిమాని, టీడీపీ సీనియర్ నేత ఎన్టీఆర్ రాజు (NTR Raju) (బి.రామచంద్రరాజు) బుధవారం మృతి చెందారు.
దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు వీరాభిమాని, టీడీపీ సీనియర్ నేత ఎన్టీఆర్ రాజు (NTR Raju) (బి.రామచంద్రరాజు) బుధవారం మృతి చెందారు. కొంతకాలంగా ఆనారోగ్యంతో ఉన్న ఆయన బుధవారం వేకువజామున తిరుమలలో తుదిశ్వాస విడిచారు.
1962లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ వ్యవస్థాపక, జనరల్ సెక్రటరీగా నియమితులై ఎన్టీ రామారావుకు అత్యంత సన్నిహితుడిగా మారారు ఆయన.

టీటీడీ బోర్డు సభ్యుడిగా పని చేసిన తొలి తిరుమల వాసి కూడా ఆయనే. ఎన్టీయార్ రాజు మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు.