భూ అంటే భూతం
ABN , Publish Date - Jun 16 , 2025 | 04:33 AM
నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘తమ్ముడు’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్...
నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘తమ్ముడు’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. లయ వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలకపాత్రలు పోషిస్తున్నారు. జులై 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. చిత్రబృందం ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచింది. ‘భూ అంటే భూతం’ అంటే సాగే గీతాన్ని ఈ మంగళవారం విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా చిత్రబృందం స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ చిత్రానికి సంగీతం: అజనీష్ లోక్‌నాథ్, సినిమాటోగ్రఫీ: కేవీ గుహన్