Niharika Konidela: నిర్మాతగా నిహారిక రెండో సినిమా ప్రారంభం 

ABN , Publish Date - Jul 02 , 2025 | 09:34 PM

'కమిటీ కుర్రాళ్ళు' చిత్రం సక్సెస్ తర్వాత కాస్త జోరు పెంచారు నిహారిక కొణిదెల .  పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెం.2 ను ఆమె ఇటీవల ప్రకటించారు.

'కమిటీ కుర్రాళ్ళు' (Commitee kurallu) చిత్రం సక్సెస్ తర్వాత కాస్త జోరు పెంచారు నిహారిక కొణిదెల Niharika Konidela).  పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెం.2 ను ఆమె ఇటీవల ప్రకటించారు. ఈ చిత్రంతో మానస శర్మ దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. సంగీత్ శోభన్, నయన్ సారిక (Manasa Sharma) జంటగా నటించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాల్ని బుధవారం అన్నపూర్ణ స్టూడియోస్ గ్లాస్ హౌస్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకకు ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్, కళ్యాణ్ శంకర్, మల్లిది వశిష్ట  అతిథులుగా విచ్చేశారు.

Niharika konidela  (2).jpg

ముహుర్తపు సన్నివేశానికి నాగ్ అశ్విన్ క్లాప్ కొట్టగా.. వశిష్ట కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి సన్నివేశానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. రెగ్యులర్ షూటింగ్ జూలై 15 నుంచి హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో జరగనుంది. ఫ్యాంటసీ, కామెడీ జోనర్ తెరెకెక్కనున్న ఈ మూవీకి అనుదీప్ దేవ్ సంగీతాన్ని అందిస్తుండగా.. అన్వర్ అలీ ఎడిటర్‌గా పని చేయనున్నారు. రాజు ఎడురోలు సినిమాటోగ్రఫర్‌గా, పుల్లా విష్ణు వర్దన్  ప్రొడక్షన్ డిజైనర్ గా, యాక్షన్ కొరియోగ్రఫీగా విజయ్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర విషయాల్ని ప్రకటించనున్నారు. 

Updated Date - Jul 02 , 2025 | 09:34 PM