Nidhhi Agerwal: ప్రభాస్ ఫ్యాన్స్‌.. నిధినీ నలిపేశారుగా

ABN , Publish Date - Dec 18 , 2025 | 10:00 AM

ఒక్కోసారి అభిమానుల చేష్టలు, వారి అత్యుత్సాహంతో  సినీ సెలెబ్రిటీలు ఎంతో ఇబ్బందికి గురవుతారు.

ఒక్కోసారి అభిమానుల చేష్టలు, వారి అత్యుత్సాహంతో  సినీ సెలెబ్రిటీలు ఎంతో ఇబ్బందికి గురవుతారు. తాజాగా హీరోయిన్  నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) ఫ్యాన్స్‌ వల్ల ఇలాంటి అసౌకర్యానికి గురయ్యారు. ‘ది రాజాసాబ్‌’  సినిమాలోని 'సహన సహన..' సాంగ్  లాంఛ్‌ ఈవెంట్‌కు వచ్చిన  ఆమెను అభిమానులు ఇబ్బంది పెట్టారు. ఈవెంట్ పూర్తై  తిరిగి తన కారు వద్దకు వెళ్లే సమయంలో వందల మంది అభిమానులు నిధి వద్దకు తోసుకుంటూ  వచ్చారు. సెల్ఫీల కోసం ఎగబడటమే కాకుండా ఆమెను  తాకేందుకు ప్రయత్నించారు.

బాడీగార్డులు సైతం అంత మంది జనాలను కంట్రోల్ చేయలేకపోయారు. చివరికి ఏదోలా ఆమెను సురక్షితంగా కారు ఎక్కించారు. ఈ తర్వాత నిధి ఊపిరి పీల్చుకున్నారు. 'ఇది అభిమానమా ఇంకేదన్నానా అన్నటు  ఆ సమయంలో అసహనానికి లోనయింది.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఆ వీడియోలు చూసి కొందరు సెలబ్రిటీస్ ఫైర్ అవుతున్నారు. అభిమానం పేరుతో జనాల్లో ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్టు కాదని చెబుతున్నారు. 

Updated Date - Dec 18 , 2025 | 04:57 PM