ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్
ABN , Publish Date - Jun 25 , 2025 | 05:28 AM
ప్రిన్స్, సుహానా ముద్వాన్ జంటగా కుమార్ రవికంటి దర్శకత్వం వహిస్తూ నిర్మించే చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి...
ప్రిన్స్, సుహానా ముద్వాన్ జంటగా కుమార్ రవికంటి దర్శకత్వం వహిస్తూ నిర్మించే చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై చిత్రబృందాన్ని అభినందించారు. ముహూర్తపు సన్నివేశానికి బేబీ దియ క్లాప్ కొట్టగా, సుమ రవికంటి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. తొలిషాట్‌కు మాయ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దర్శకనిర్మాత కుమార్ రవికంటి మాట్లాడుతూ ‘ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కనుంది. చక్కటి హాస్యం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల కలయికగా ఈ సినిమా ఉంటుంది’ అని తెలిపారు. కాగా, ఈ చిత్రంలో నెల్లూరు సుదర్శన్ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు.