Nara Rohith: శ్రీవారిని దర్శించుకున్న.. నారా రోహిత్ దంపతులు
ABN , Publish Date - Nov 02 , 2025 | 12:08 PM
టాలీవుడ్ నటుడు నారా రోహిత్, భార్య శిరీషతో కలిసి వివాహానంతరం తొలిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన టాలీవుడ్ నటుడు నారా రోహిత్ (Nara Rohith), ఆయన సతీమణి శిరీష (Shirisha) ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీర్వాదం పొందారు. అక్టోబర్ 30న వివాహం అనంతరం ఈ దంపతులు తొలిసారిగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల (Tirumala) చేరుకున్నారు.
ముందుగా తమ స్వగ్రామం నారా వారి పల్లెకు వెళ్లిన ఈ జంట ఆదివారం తిరుమలకు చేరుకుని వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. నూతన దంపతులకు టీటీడీ అధికారులు ఆలయ ప్రాంగణంలో సాదరంగా స్వాగతించి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వారికి వేదాశీర్వచనాలు అందించగా, ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను సమర్పించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.