Neelam Sai Rajesh:నిర్మాతల సహకారం వల్లే
ABN , Publish Date - Aug 02 , 2025 | 06:23 AM
సంపూర్ణేష్ బాబు హీరోగా 2014లో వచ్చిన హృదయ కాలేయం సినిమాతో తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయమయ్యారు
సంపూర్ణేష్ బాబు హీరోగా 2014లో వచ్చిన ‘హృదయ కాలేయం’ సినిమాతో తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయమయ్యారు నీలం సాయి రాజేష్. ఆ తర్వాత ‘కొబ్బరి మట్ట’, ‘కలర్ ఫొటో’ చిత్రాలకు పనిచేశారు. 2023లో ‘బేబి’ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా స్ర్కీన్‌ప్లేకు గాను జాతీయ ఉత్తమ స్ర్కీన్‌ప్లే రచయితగా అవార్డు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘బెస్ట్ స్ర్కీన్‌ప్లే, బెస్ట్ మేల్ సింగర్..ఇలా రెండు జాతీయ అవార్డులు ‘బేబీ’ సినిమాకు రావడం ఆనందంగా ఉంది. స్ర్కీన్‌ప్లేకి జాతీయ అవార్డు రావడమనేది చాలా పెద్ద విషయం. నన్ను నమ్మి నాతో సినిమా తీసిన నిర్మాతలకు నా ధన్యవాదాలు’ అని అన్నారు.