Anaganaga Oka Raju: భీమవరం బాల్మా.. బాగా బీచ్ పోదుమా! నవీన్ ఆట, పాట అదరగొట్టాడుగా
ABN , Publish Date - Nov 27 , 2025 | 06:50 PM
నవీన్ పొలిశెట్టి అననగా ఒక రాజు చిత్రం నుంచి హీరో నవీన్ స్వయంగా ఆలపించిన భీమవరం బాల్మా.. బాగా బీచ్ పోదుమా లిరికల్ సాంగ్‌ను గురువారం రాత్రి రిలీజ్ చేశారు.
చాలా విరామం తర్వాత స్టార్ ఎంటర్ టైనర్ నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) నటిస్తున్న చిత్రం అననగా ఒక రాజు (Anaganaga Oka Raju). మీనాక్షి చౌదరి (Meenakshi) కథానాయిక. మూడేండ్ల క్రితమే స్టార్ట్ చేసిన ఈ చిత్రం ఎట్టకేలకు తెరమీదకు వచ్చేందుకు సిద్దమైంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ షురూ చేయగా ఇటీవల విడుదల చేసిన గ్లిమ్స్, వీడియోలు మంచి ఫన్ పంచుతూ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.
ఈ నేపత్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి భీమవరం బాల్మా (Bhimavaram Balma Lyrical) అంటూ సాగే ఫస్ట్ సింగిల్ మాస్ సాంగ్‌ను మేకర్స్ గురువారం భీమవరంలో రిలీజ్ చేశారు. అస్కార్ విన్నర్ చంద్రబోస్ (Chandrabose) ఈ గేయానికి సాహిత్యం అందించగా మిక్కీ జే మేయర్ (Mickey J Meyer) సంగీతంలో నూతన మోహన్(Nutana Mohan) తో కలిసి హీరో నవీన్ గాయకుడిగా మారడం విశేషం. చాట్ జీపీటీ ఎవరే ఈ బ్యూటీ ఇంతదంగా ఉందేంటీ హీయ్.. డ్రెస్సులు ఒక్కోటి వెల కడితే కోటి అంటూ మంచి మాస్ అప్పీల్ వచ్చే పదాలు, బీట్‌తో సాగుతూ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే వినేయండి.