O Cheliya: ‘కొంచెం కొంచెంగా’ అంటూ మెలోడీ వచ్చేసింది
ABN , Publish Date - Oct 04 , 2025 | 01:45 PM
నాగ ప్రణవ్, కావేరి కర్ణిక, ఆద్య రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓ.. చెలియా’. ఎస్‌ఆర్ఎస్ మూవీ క్రియేషన్స్, ఇందిరా దేవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌ల మీద రూపాశ్రీ కొపురు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం. నాగ రాజశేఖర్ రెడ్డి దర్శకుడు.
నాగ ప్రణవ్(Naga PRanav), కావేరి కర్ణిక, ఆద్య రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓ.. చెలియా’ (O Cheliya). ఎస్‌ఆర్ఎస్ మూవీ క్రియేషన్స్, ఇందిరా దేవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌ల మీద రూపాశ్రీ కొపురు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం. నాగ రాజశేఖర్ రెడ్డి దర్శకుడు. తాజాగా హీరో నవీన్ చంద్ర చేతులు మీదుగా 'కొంచెం కొంచెంగా' అంటూ సాగే మెలోడీ పాటను విడుదల చేశారు మేకర్స్. ఎంఎం కుమార్ సంగీతం అందించారు. సుధీర్ బగాడి సాహిత్యం అందించిన ఈ పాటను వాగ్దేవి, మనోజ్ పాడారు.
నవీన్ చంద్ర మాట్లాడుతూ 'ఓ.. చెలియా’ నుంచి మంచి మెలోడీ సాంగ్‌ను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. ఈ పాట అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఓ మంచి మెలోడీ పాటను వినలేదు. హీరో హీరోయిన్లు చాలా చక్కగా కనిపిస్తున్నారు. లవ్, థ్రిల్లర్ ఇలా అన్ని అంశాల్ని కలగలపిన సినిమా ఇది' అని అన్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.