Naveen Chandra: నవీన్ చంద్ర  ‘కరాలి' మొదలైంది

ABN, Publish Date - May 18 , 2025 | 04:02 PM

నవీన్ చంద్ర, రాశీ సింగ్ , కాజల్ చౌదరి హీరో హీరోయిన్లుగా మంద‌ల‌పు శివకృష్ణ నిర్మిస్తున్న తొలి చిత్రం ‘కరాలి’.


నవీన్ చంద్ర(Naveen Chandra), రాశీ సింగ్ (Raasi Singh), కాజల్ చౌదరి (Kajal Chowdary) హీరో హీరోయిన్లుగా మంద‌ల‌పు శివకృష్ణ నిర్మిస్తున్న తొలి చిత్రం ‘కరాలి’ (Karali). ఈ మూవీకి రాకేష్ పొట్టా దర్శకత్వం వహిస్తున్నారు.   శ్రీమ‌తి మంద‌ల‌పు ప్ర‌వ‌ల్లిక స‌మ‌ర్ప‌ణ‌లో విక్రాంత్ ఫిల్మ్ క్రియేషన్స్ బ్యానర్ పై ఆదివారం పూజా కార్యక్రమాలతో మొదలైంది.  చిత్ర యూనిట్‌కు సాహు గారపాటి స్క్రిప్ట్‌ను అందజేసి  ముహూర్త‌పు స‌న్నివేశానికి క్లాప్ కొట్ట‌గా, శ్రీహ‌ర్షిణి ఎడ్యుకేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూష‌న్స్ అధినేత గోరంట్ల ర‌వికుమార్‌, యాస్పైర్ స్పేసెస్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ తుమాటి న‌ర‌సింహా రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.   


నవీన్ చంద్ర మాట్లాడుతూ... ‘కొత్త వారు కొత్త పాయింట్‌తో వచ్చినప్పుడు సినిమాలు నిర్మించేందుకు శివ గారి లాంటి ధైర్యం ఉన్న వాళ్లు ముందుకు రావాలి. ‘కరాలి’ అనే టైటిల్ ఎంత కొత్తగా, డిఫరెంట్‌గా ఉందో  సినిమా కూడా అంతే కొత్తగా ఉంటుంది. ఇంత వరకు నేను చేయని ఓ డిఫరెంట్ యాక్షన్ డ్రామా ఇది" అని అన్నారు.

నిర్మాత మంద‌ల‌పు శివకృష్ణ మాట్లాడుతూ ‘నేను కేంద్ర ప్రభుత్వ మాజీ ఉద్యోగిని. అక్కడ వీఆర్ఎస్ తీసుకుని సినిమాల మీద ప్యాషన్‌తో ఇంత వరకు కూడబెట్టుకున్న డబ్బులతో ఇక్కడకు వచ్చాను. నాకున్న ప్యాషన్‌తోనే ప్రొడక్షన్ స్టార్ట్ చేశాను. ఆ టైంలోనే రాకేష్ పొట్ట గారు కథను చెప్పారు. నాకు ఆ కథ చాలా నచ్చింది. క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తాం. కొత్త యాక్షన్ మూవీని అందరి ముందుకు తీసుకు వస్తాం" అని అన్నారు.
 
 
 
 

Updated Date - May 18 , 2025 | 04:02 PM