Varalaxmi Sarathkumar: 'పోలీస్ కంప్లెయింట్'లో సూపర్ స్టార్ కృష్ణపై స్పెషల్ సాంగ్...

ABN , Publish Date - Dec 06 , 2025 | 03:58 PM

నవీన్ చంద్ర, వరలక్ష్మీ శరత్ కుమార్ జంటగా నటిస్తున్న సినిమా 'పోలీస్ కంప్లైంట్'. ఈ సినిమాను మేగోటి సంజీవ్ కుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ మహరాణా నిర్మిస్తున్నారు. ఇందులో సూపర్ స్టార్ కృష్ణ స్పెషల్ సాంగ్ ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.

Police Complaint Movie

గ్లామర్ పాత్రలతో పాటు విలన్ క్యారెక్టర్స్ సైతం వేస్తూ నటిగా తానేమిటో తెలియచేస్తోంది వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar). అలానే హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా వైవిధ్యమైన పాత్రలను పోషిస్తున్నాడు నవీన్ చంద్ర (Naveen Chandra). వీరిద్దరూ జంటగా నటిస్తున్న వినోదభరిత చిత్రం 'పోలీస్ కంప్లెయింట్' (Police Complaint).

'పోలీస్ కంప్లెయింట్' మూవీ గురించి నిర్మాత బాలకృష్ణ మ‌హరాణా మాట్లాడుతూ, 'ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర ప‌వ‌ర్‌ఫుల్ గా ఉంటుంది. అదే సమయంలో ఆ పాత్ర ద్వారా వినోదాన్నీ పంచుతుంది. సూపర్ స్టార్ కృష్ణ (Superstar Krishna) గారిపై చిత్రీకరించిన ప్రత్యేక గీతం సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంది' అని అన్నారు.


Varalakshmi Sharath Kumar - Naveen Chandra (1) new.jpg

తెలుగు, తమిళ భాషల్లో 'అఘోర'తో పాటు 'ఆప్త, పౌరుషం, రాఘవ రెడ్డి, ఆదిపర్వం' వంటి విభిన్న చిత్రాలను రూపొందించిన దర్శకుడు సంజీవ్ మేగోటి 'పోలీస్ కంప్లెయింట్'ను తెరకెక్కించారు. ఇందులో కృష్ణ సాయి (Krishna Sai), రాగిణి ద్వివేది, రవిశంకర్, ఆదిత్య ఓం (Aditya Om), శ్రీనివాస్ రెడ్డి ,సప్తగిరి, జెమినీ సురేష్, అమిత్, దిల్ రమేష్, పృథ్వీ (యానిమల్) తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ కథ గురించి సంజీవ్ మేగోటి చెబుతూ, 'చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌పై ఈ సినిమా తీశాం. మనం చేసే ప్రతి చర్య తిరిగి మనకే ఫలితంగా వస్తుందన్న భావనను హారర్ థ్రిల్లర్‌గా కొత్త కోణంలో చూపించనున్నాం. అందరి సహకారంతో షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేశాం, సినిమా అవుట్ ఫుట్ బాగా వ‌చ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ వ‌ర్క్ పూర్తి కాగానే విడుద‌ల‌కు స‌న్నాహాలు చేస్తాం' అని తెలిపారు. ఈ చిత్రానికి ఆరోహణ సుధీంద్ర, సుధాకర్ మారియో, సంజీవ్ మేగోటి సంగీతం అందిస్తున్నారు.

Updated Date - Dec 06 , 2025 | 03:59 PM